Kashmir files: కశ్మీర్ ఫైల్స్ మూవీ డైరెక్టర్‌కు Y క్యాటగిరీ భద్రత- కారణాలివే..
Kashmir files: బాలీవుడ్ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రికి భద్రత పెంచాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇటీవల ఆయన తీసిన కశ్మీర్ ఫైల్స్ విజయవంతంగా ప్రదర్శితమవుతుండగా.. వ్యతిరేకత కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు Y సెక్యూరిటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
Kashmir files: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సినిమా 'కశ్మీర్ ఫైల్స్'. ఎన్నో వివాదాల నడుమ విడదలై.. థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా రికార్డుల చుట్టూ వివాదాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఊ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి భద్రత పెంచింది కేద్రం. ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బందితో కూడిన 'వై' క్యాటగిరి భద్రతను కల్పించాలని నిర్ఱయించింది.
పెద్ద పెద్ద నాయకుల ప్రశంసలు..
చిన్న సినిమా అయినా.. ఇప్పుడు రికార్డు వసూళ్లు నమోదు చేస్తూ దూసుకెళ్తోంది. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హో మంత్రి అమిత్ షా సహా పెద్ద పెప్ద నాయకులు సైతం ఈ సినిమాను పొగిడేస్తుండటం విశేషం.
కశ్మీర్ లోయలో హిందూ పండిట్లపై జరిగిన అకృత్యాలను కల్లకు కట్టినట్లు చూపించారంటూ సినిమా చూసిన వారు చెబుతున్నారు.
అయితే ఈ సినిమాకు ఆది నుంచే కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా ఈ సినిమా వల్ల హిందూ, ముస్లీం మధ్య విద్వేశాలు రెచ్చగొడతాయని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఈ సినిమా థియేటర్లలో విడుదలై.. సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి భద్రతను పెంచింది ప్రభుత్వం.
Also read: స్టార్స్ హీరోలు మా సినిమాల్లో నటించడానికి ఇష్టపడరు.. మహేష్ బాబు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!!
Also read: Salute Movie Review: సెల్యూట్ మూవీ రివ్యూ.. పోలీస్ ఆఫీసర్ గా దుల్కర్ సల్మాన్ మెప్పించాడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook