Kasthuri Shankar Drinking Habit గృహలక్ష్మీ సీరియల్‌తో ఇప్పుడు కస్తూరీ శంకర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఒకప్పుడు అన్నమయ్య, భారతీయుడు సినిమాల్లో కనిపించి మెప్పించింది. ఇప్పుడు సీరియల్‌తో ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక పరంపర అనే వెబ్ సిరిస్‌లో బోల్డ్ పాత్రను పోషించింది. సిల్వర్ స్క్రీన్ మీద అడపాదడపా పాత్రలు వేస్తూనే ఉంది. ఇలా ఎంత బిజీగా ఉన్నా కూడా ఆమె ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గానే ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఆమె వరుసగా నెటిజన్లకు రిప్లైలు ఇస్తూ వస్తోంది. చెన్నై మెట్రోలో తన ఫోన్ పోగొట్టుకోవడం, అధికారులకు కంప్లైంట్ ఇవ్వడంతో వెంటనే దాన్ని తిరిగి తెచ్చివడం అందరికీ తెలిసిందే. ఇలా అధికారులు వెంటనే స్పందించడంతో కస్తూరీ మురిసిపోయింది. ఈ ఘటన మీద ఓ నెటిజన్ ఇలా రియాక్ట్ అయ్యాడు. నీకు సొంతంగా కారు లేదా? ఇలా మెట్రోలో ట్రావెల్ చేయడం ఏంటి? పబ్లిసిటీ కోసమా? అని అడిగేశాడు.


 



దానికి కస్తూరీ ఇలా సమాధానం ఇచ్చింది. నాకు సొంతంగా ఓ కారు లేదు.. ఇంట్లో టీవీ కూడా లేదు.. ఏసీ కూడా వాడను.. సింపుల్‌గా బతికేస్తాను అని చెప్పుకొచ్చింది. దీని మీద ఓ నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. నిజంగానే ఇలాంటి వాళ్లున్నారా? లేదంటే నేను తప్పుగా ఆలోచిస్తున్నానా? అని ట్వీట్ వేశాడు. దానికి కస్తూరీ ఇలా ట్వీట్ వేసింది.


నేను మందు కూడా తాగను, పాలు, కాఫీ టీ, సాఫ్ట్ డ్రింక్స్ ఇలా ఏదీ కూడా తాగను, మాంసం కూడా తినను, బయటి ఫుడ్, జంక్ ఫుడ్ అసలే ముట్టను, స్నానం చేసేటప్పుడు సబ్బు కూడా వాడను, బ్యూటీ ట్రీట్మెంట్లు చేయించుకోను, ప్లాస్టిక్ వాడను, సిల్క్, లెథర్ వస్తువులను ఉపయోగించను, మా కుటుంబం అంతా కూడా ఇలానే ఉంటాం.. సాత్వికమైన జీవనాన్ని అనుసరిస్తుంటాం.. అని చెప్పుకొచ్చింది.


Also Read : Ali - Pawan Kalyan : మా మధ్య గ్యాప్ లేదు.. క్రియేట్ చేశారు!.. పవన్ కళ్యాణ్‌తో రిలేషన్ మీద అలీ కామెంట్స్


Also Read : Suguna Sundari Lyrical Video : బాలయ్య చిందులు.. శ్రుతి హాసన్ అందాలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook