Katrina-Vicky: బాలీవుడ్ క్వీన్ కు స్పెషల్ గిఫ్ట్ పంపిన కత్రినా-విక్కీ
Katrina-Vicky: కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల వివాహం ఇటీవలె జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జంట బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు స్పెషల్ గిప్ట్ పంపారు.
Katrina-Vicky: బాలీవుడ్ కొత్త కపుల్ కత్రినాకైఫ్, విక్కీ కౌశల్(Vicky kaushal)...బీటౌన్ బ్యూటీ కంగనా రనౌత్(Kangana Ranuat)కు స్పెషల్ గిప్ట్ పంపారు. ఇటీవల కత్రినా, విక్కీ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్(Omicron) నేపథ్యంలో...అతి తక్కువ మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో పెళ్లికి ఆహ్వానించని సినీ తారలందరికీ ఈ జంట ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్(Return Gifts)లు పంపిస్తోంది. ఈ గిప్ట్ బాక్స్ లో నాలుగు రకాల పంజాబీ స్వీట్స్, థ్యాంక్యూ లెటర్ కూడా ఉంచారు.
Also Read: Katrina, Vicky haldi ceremony : పసుపు రాసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్..
ఇందులో భాగంగా... కంగనాకు గిఫ్ట్ బాక్స్ పంపించారు ఈ జంట. ఈ విషయాన్ని తెలియజేస్తూ కంగన.. ‘''సువాసనతో కూడిన పువ్వులు, రుచికరమైన నేతి లడ్డూలు పంపించినందుకు థ్యాంక్యూ విక్కీ-కత్రినా. కంగ్రాట్స్''’ అని పోస్ట్ చేసింది. మరోవైపు, వివాహమైన అనంతరం ఈ జంట హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. కత్రినా కైఫ్(Katrina Kaif) విక్కీ కౌశల్‌ల పెళ్లి డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని (Rajasthan) సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో ఘనంగా జరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook