Keeravani Great Words About RGV: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఒరిజినల్ బెస్ట్ స్కోర్ కేటగిరీలో ఎంఎం కీరవాణికి ఆస్కార్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఈ ఆస్కార్ అవార్డుతో ప్రతి ఒక్క తెలుగు వాడు ఉప్పొంగిపోతున్నాడు, ఇదిరా మా తెలుగు సినిమా సత్తా అంటూ గర్వంగా కాలర్ ఎగరేస్తున్నాడు. అయితే ఈ ఆస్కార్ తనకు రెండవ ఆస్కార్ అవార్డు అని తనకు వర్మ పేరుతో ముందుగానే ఒక ఆస్కార్ అవార్డు లభించింది అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంఎం కీరవాణి విజయేంద్ర ప్రసాద్ అన్న శివశక్తి దత్త కుమారుడైన కీరవాణి ముందుగా కొందరు సంగీత దర్శకుల వద్ద సంగీత సాధన చేశారు. వారి దగ్గర పని నేర్చుకొని తాను సంగీత దర్శకుడుగా మారడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆయనకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదట. తనకు అవకాశం ఇవ్వమని ఆయన 51 మంది దర్శకుల దగ్గరకు వెళ్లారట. అయితే అలాంటి వారందరిలో కొందరు వాటిని తన కళ్ళముందే చెత్తబుట్టలో పడేస్తే మరి కొంతమంది మాత్రం నీ ట్యూన్స్ బాగున్న నిన్ను తీసుకోలేకపోతున్నాం అని చెప్పి పంపించేవారట. కానీ రామ్ గోపాల్ వర్మ రూపంలో తనకు ఒక ఆస్కార్ అవార్డు దొరికిందని ఆయన అన్నారు.



ఎందుకంటే రాంగోపాల్ వర్మకి శివా పేరుతో ఒక ఆస్కార్ అవార్డు దొరికిందని అని చెప్పుకొచ్చారు. అలా శివా పేరుతో ఒక ఆస్కార్ అవార్డు అందుకున్న రాంగోపాల్ వర్మ దగ్గరకు నేను వెళ్లి నాకు అవకాశం ఇవ్వమని అడిగితే వెంటనే ఆలోచించకుండా క్షణక్షణం అనే సినిమాకి ఆయన అవకాశం ఇచ్చారు. అలా ఇవ్వటమే అలా నాకు వర్మ దొరకడమే పెద్ద ఆస్కార్ అంటున్నారు కీరవాణి. అలా రాంగోపాల్ వర్మ తనను తీసుకున్నారని తెలిసి అప్పుడు తాను ఎవరు ఏమిటి అని కూడా తెలుసుకోకుండా వర్మ తీసుకున్నాడు అంటే వీడి దగ్గర విషయం ఉండే ఉంటుంది అని ఇంకా చాలామంది దర్శకులు నన్ను బుక్ చేసుకున్నారు.


అలాంటి వర్మ నాకు దొరికిన మొదటి ఆస్కార్ అవార్డు అంటూ రామ్ గోపాల్ వర్మ గురించి కీరవాణి ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ వీడియో విన్న రామ్ గోపాల్ వర్మ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి కీరవాణి నువ్వు చెప్పిన మాటలు వింటుంటే నాకు చచ్చినట్టు అనిపిస్తోంది, ఎందుకంటే చచ్చిన వాళ్లనే ఇలా పొగడగలరు అంటూ రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. అయితే కీరవాణి లాంటి ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇక మీ జీవితానికి ఇది చాలు చచ్చిపోయినా పరవాలేదు అంటూ రాంగోపాల్ వర్మ అభిమానులు కొందరు కామెంట్ చేస్తున్నారు.
Also Read: Dasara Sensor Cuts: తెలుగు చరిత్రలోనే అత్యదిక సెన్సార్ కట్స్.. 'దసరా'కు ఏమేం కట్స్ చెప్పారంటే?


Also Read: Samantha about Arha: అల్లు అర్హకు ఇంగ్లీష్ రాదు.. ఎంతో గొప్పగా పెంచుతున్నారు.. బన్నీ పెంపకంపై సమంత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook