Good Luck Sakhi Review: టాలీవుడ్‌లో కీర్తి సురేశ్‌ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తన ఫస్ట్‌ మూవీ నేను శైలజతోనే తెలుగు ప్రేక్షకులకు చేరువైంది కీర్తి సరేశ్. మహానటి సినిమాతో కీర్తి సురేశ్‌కు ప్రత్యేక పేరు వచ్చింది. ఆ చిత్రం తర్వాత కీర్తి వరుసగా మూవీలతో బిజీ అయిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకవైపు స్టార్‌ హీరోలతో కలిసి నటిస్తూనే.. మరోవైపు లేడి ఓరియెంటెడ్‌ మూవీల్లో కూడా తన నటనతో మెప్పిస్తోంది ఈ భామ. తాజాగా కీర్తి సరేశ్ (Keerthy Suresh) నటించిన లేడి ఓరియెంటెడ్‌ సినిమా గుడ్‌ లక్‌ సఖి రిలీజైంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ఆది పినిశెట్టితో (Aadhi Pinisetty) పాటు జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీ రోల్స్ ప్లే చేశారు.


ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. కొవిడ్ (Covid) వల్ల​ వాయిదాపడుతూ వచ్చింది. మొత్తానికి ఇవాళ రిలీజైన ఈ మూవీ ప్రీమియర్స్‌ చూసిన వారంతా సోషల్ మీడియాలో పోస్ట్స్‌ చేస్తున్నారు.


Also Read: TS schools reopen: రాష్ట్రంలో విద్యా సంస్థల రీ ఓపెన్​పై ప్రభుత్వం ఏమదంటే..!



గుడ్‌ లక్‌ సఖి మూవీ యావరేజ్‌గా ఉందంటూ కొందరు అంటున్నారు. అయితే కీర్తి సురేశ్‌ నటన మాత్రం చాలా అద్భుతంగా ఉందంటున్నారు. మూవీ (Movie) క్రీడా నేపథ్యంతో తెరకెక్కినా.. కుటుంబ సమేతంగా చూడొచ్చు అంటూ మరి కొందరు చెబుతున్నారు. జగపతి బాబు, (Jagapathi Babu) ఆదిపినిశెట్టి పెర్ఫార్మన్స్ కూడా అదిరిపోయిందంటున్నారు.


Also Read: Kevin Pietersen: భారతదేశంలో మీకు ఏది బాగా ఇష్టం.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్ ఏం చెప్పాడంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook