TS schools reopen: రాష్ట్రంలో విద్యా సంస్థల రీ ఓపెన్​పై ప్రభుత్వం ఏమదంటే..!

TS schools reopen: రాష్ట్రంలో స్కూల్స్​ తెరిచే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది ప్రభుత్వం. హై కోర్టు విచారణలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 01:49 PM IST
  • స్కూల్స్ రీ ఓపెనింగ్​పై ప్రభుత్వం ప్రకటన
  • ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడి
  • హై కోర్టు విచారణలో కీలక వివరాలు..
TS schools reopen: రాష్ట్రంలో విద్యా సంస్థల రీ ఓపెన్​పై ప్రభుత్వం ఏమదంటే..!

TS schools reopen: తెలంగాణలో స్కూళ్లు తెరిచే విషయంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తెలంగాణ హై కోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కీలక విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం స్కూళ్లు తెరిచే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని (Telangana schools reopening) వివరించింది ప్రభుత్వం. ఈ నెలాఖరు నుంచి విద్యా సంస్థలు తెరుస్తారా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాలు చెప్పింది.

ప్రభుత్వానికి కోర్టు సూచనలు..

రాష్ట్రంలో ప్రస్తుత కొవిడ్ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హై కోర్టు. ముఖ్యంగా సంతల్లో తీసుకుంటున్న కొవిడ్ జాగ్రత్తలు, సమ్మక్క జాతర ఏర్పాట్లపై నివేదికను ఇవ్వాలని (Telangana high court on Corona) సూచించింది.

రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు ఇలా..

రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు ప్రస్తుతం 3.16 శాతంగా ఉందని రాష్ట్ర పబ్లిక్​ హెల్త్ డైరెక్టర్​ శ్రీనివాసరావు (Corona update in Telangana) తెలిపారు.

ఇటీవల తాను కరోనా బారిన పడిన కారణంగా వర్చువల్​గా విచారణకు హాజరయ్యారు శ్రీనివాసరావు. మరో మూడు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని డీహెచ్​కు హైకోర్టు సూచించింది. ఈ విషయంపై తదుపరి విచారణ ఫిబ్రవరి 3కు వాయిదా పడింది.

Also read: Telangana New land values: భూములకు కొత్త మార్కెట్ ధరలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Also read: Karvy Group Case: కార్వీ కుంభకోణంలో తోడు దొంగలు వాళ్లే.. వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News