Keerthy Suresh Casting Couch క్యాస్టింగ్ కౌచ్ అనేది అన్ని రంగాల్లో ఉంటుంది. అయితే సినిమా సెలెబ్రిటీల మీద అందరి ఫోకస్ ఉండటంతో.. కేవలం క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇక్కడే ఉంటుందని అనుకుంటారు. కానీ ప్రతీ రంగంలో, ప్రతీ చోటా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది. అయితే క్యాస్టింగ్ కౌచ్ అనేది మన ప్రవర్తన మీద కూడా ఆధార పడి ఉంటుంది. మనం చాన్స్ ఇస్తేనే అవతలి వాళ్లు చాన్స్ తీసుకుంటారు. ఇదే మాటను ఇప్పుడు కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కీర్తి సురేష్ ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచే వచ్చింది. కీర్తి సురేష్‌ తల్లిదండ్రులు మాలీవుడ్లో ఫేమస్సే. అయితే కీర్తి సురేష్‌కు ఇప్పటి వరకు క్యాస్టింగ్ కౌచ్ అనేది అనుభవంలోకి రాలేదని చెప్పుకొచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది మన ప్రవర్తన మీద కూడా ఆధారపడి ఉంటుంది.. అందుకే ఇప్పటి వరకు నాకు అలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఒక వేళ నన్ను ఎవరైనా కమిట్మెంట్ అడిగితే.. నేను దానికి అంగీకరించను అని ఖరాఖండిగా చెప్పేసింది.


నేను ఒక వేళ దాన్ని అంగీకరించాల్సిన పరిస్థితే వస్తే.. నేను సినిమాలు వదిలేసి జాబ్ చేసుకుంటాను గానీ అలాంటి కమిట్మెంట్లను మాత్రం అంగీకరించను.. నేను అవకాశాల కోసం ఇలాంటి అడ్డదారులు దొక్కి కమిట్మెంట్లు ఇచ్చే దాన్ని కాదు అని చెప్పుకొచ్చింది. కీర్తి సురేష్ చివరగా మహేష్‌ బాబుతో కలిసి సర్కారు వారి పాట అంటూ వచ్చింది. ఇక త్వరలోనే నాని దసరా చిత్రంతో సందడి చేయనుంది.


కరోనా సమయంలో కీర్తి సురేష్‌ చేసిన చిత్రాలన్నీ ఓటీటీలోకి వచ్చాయి. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఏ ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు. కీర్తి సురేష్‌కు విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి ఇలా అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. నితిన్‌తో చేసిన రంగ్ దే సినిమా కూడా ఆశించినంతగా ఆడలేదు. దీంతో కీర్తి సురేష్‌ గ్రాఫ్‌ కాస్త తగ్గినట్టు అయింది.


Also Read : Hansika Motwani Wedding : ఇప్పటికీ ఎప్పటికీ నిలిచే ప్రేమ.. పెళ్లి ఫోటోలను షేర్ చేసిన హన్సిక


Also Read : Janhvi Kapoor Drinking : తప్పతాగి వచ్చావా?.. జాన్వీ కపూర్ మీద ట్రోలింగ్.. నెటిజన్ల కామెంట్లు వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook