Janhvi Kapoor Drinking : తప్పతాగి వచ్చావా?.. జాన్వీ కపూర్ మీద ట్రోలింగ్.. నెటిజన్ల కామెంట్లు వైరల్

Janhvi Kapoor Gets Trolled జాన్వీ కపూర్ ప్రస్తుతం నెట్టింట్లో ట్రోలింగ్‌కు గురవుతోంది. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన జాన్వీ తన కారు ఎక్కడుందో కూడా గుర్తు పట్టలేకపోతోంది. డ్రైవర్ ఎక్కడున్నాడో కూడా తెలియనట్టుగా ప్రవర్తించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2022, 11:42 AM IST
  • నెట్టింట్లో జాన్వీ కపూర్ రచ్చ
  • తప్పతాగిందా? అని నెటిజన్ల ట్రోల్స్
  • జాన్వీ కపూర్ వీడియో వైరల్
Janhvi Kapoor Drinking : తప్పతాగి వచ్చావా?.. జాన్వీ కపూర్ మీద ట్రోలింగ్.. నెటిజన్ల కామెంట్లు వైరల్

Janhvi Kapoor Drinking Video : జాన్వీ కపూర్ మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. మామూలుగానే జాన్వీ కపూర్‌ను ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారు. ఆమె వస్త్రధారణ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటుంది. ఆమె సినిమాల ద్వారా ఫేమస్ అవ్వడం కంటే ఇలా ట్రోలింగ్ ద్వారానే ఎక్కువగా ఫేమస్ అవుతుంటుంది. ఆమె అందాల ప్రదర్శన నెట్టింట్లో అందరికీ కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ తాజాగా ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చినట్టు కనిపిస్తోంది.

ఇక ఆమె ఎక్కడ కనిపించినా ఫోటో గ్రాఫర్లు మాత్రం ఊరికే ఉండరు. కెమెరా కళ్లకు పని చెబుతూనే ఉంటారు. అలా కెమెరా కళ్లన్ని కూడా జాన్వీ కపూర్‌ను స్కాన్ చేస్తూ ఉన్నాయి. అయితే జాన్వీ మాత్రం ఈ లోకంలో ఉన్నట్టుగా కనిపించడం లేదు. తన కారు ఎక్కడుందో కూడా గుర్తు పట్టలేకపోయింది. నా కారు ఎక్కడుంది? అని అందరినీ అడిగేస్తోంది. ఇక తన డ్రైవర్ వెనకాలే ఉన్నా కూడా గుర్తు పట్టలేనంత మైకంలో ఉండిపోయింది. తన డ్రైవర్ వెనకాలే ఉన్న సంగతి గుర్తించలేపోయింది.

కెమెరామెన్లు చెబితే గానీ తెలుసుకోలేకపోయింది. నీ వెనకాలే డ్రైవర్ ఉన్నాడు అని వాళ్లు చెప్పాక.. తెలుసుకుంది జాన్వీ కపూర్. ఇలా మొత్తానికి జాన్వీ కపూర్‌ను చూసిన జనాలు బాగానే తప్ప తాగినట్టుందని అన్నారు. మొత్తానికి జాన్వీ కపూర్‌ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో ట్రోలింగ్‌కు గురవుతోంది.

 

చివరగా జాన్వీ కపూర్ మిలీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది. జాన్వీ కపూర్‌ మిలీ సినిమా ప్రమోషన్స్ కోసం హైద్రాబాద్‌కు కూడా వచ్చింది. ఎన్టీఆర్‌తో కలిసి నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని కూడా చెప్పింది. ఈ మధ్యే తిరుమల కొండ మీద లంగావోణితో జాన్వీ కపూర్ కనిపించి కనువిందు చేసింది. ప్రస్తుతం జాన్వీని హీరోయిన్‌గా తీసుకోవాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. ఇక రామ్ చరణ్ సరసన జాన్నీ నటించేందుకు ఎక్కువ అవకాశాలున్నట్టుగా కనిపిస్తోంది.

Also Read : Anchor Anasuya : ఇన్నాళ్లు బతిమిలాడా.. ఇకపై యాక్షనే.. కేసులపై వదలనంటోన్న అనసూయ

Also Read : Yash Daughter Ayra : రాకీ భాయ్ కూతురి బర్త్ డే.. యశ్ ఫ్యామిలీ పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News