Keerthy Suresh and Anirudh Ravichander’s wedding news: కీర్తి సురేష్ పెళ్లి గురించి కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బిజెపి నాయకుడి కొడుకుతో Keerthy Suresh marriage చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పందం కుదుర్చుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ కీర్తి సురేష్ కుటుంబ సభ్యులు ఆ పుకార్లను కొట్టిపారేశారు. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లి ట్రెండింగ్ అవుతోంది. కీర్తి సురేష్, ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ ఈ మధ్య డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. త్వరలోనే పెళ్లి కూడా చేసుకునేందుకు నిర్ణయించుకున్నారనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం సారాంశం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Anirudh Ravichander కి సౌతిండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యధిక అభిమానులు కలిగి ఉన్న మ్యూజిక్ కంపోజర్‌గా మంచి గుర్తింపు ఉంది. అనిరుధ్ రవిచందర్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కి దగ్గరి బంధువు కూడా. అనిరుద్ రవిచందర్, కీర్తి సురేష్‌లకు ఇద్దరికీ కొంతమంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు.  ఆ కారణంగానే ఆ ఇద్దరి మధ్య చిగురించిన స్నేహం డేటంగ్‌కి దారితీసిందని, ఆ Dating relationships బంధాన్నే పెళ్లి వరకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారని కోలీవుడ్ టాక్. 


Also read : Uppena movie review: ఉప్పెన మూవీ రివ్యూ, రేటింగ్


విచిత్రమేమిటంటే, Keerthy Suresh, Anirudh Ravichander ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టుగా ఇప్పటి వరకు ఎక్కడా టాక్ వినిపించలేదు. కీర్తి సురేష్ ప్రస్తుతం Mahesh Babu సరసన సర్కారు వారీ పాట చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చపై కీర్తి సురేష్, అనిరుద్ రవిచందర్ ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి.


https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook