Dasara-keerthy suresh: నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న చిత్రం 'దసరా'.  శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. ఈ చిత్రంలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సింగరేణి నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పక్కా మాస్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే నాని ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. తాజాగా కీర్తి సురేష్ (keerthy suresh) కు  సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. ‘బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన’..అనే క్యాప్షన్‌తో వీడియోను ట్వీట్ చేసింది చిత్రబృందం. పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కీర్తి నటించినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. బ్యాగ్రౌండ్‌ స్కోరును ఫోక్ సింగర్ కనకవ్వ అలపించినట్లు తెలుస్కోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ ఉదయం 11.11 గంటలకు కీర్తి సురేష్  ఫస్ట్ లుక్ (keerthy suresh First look)ను విడుదల చేయనున్నారు మేకర్స్. 'నేను లోకల్' సినిమా తర్వాత నాని, కీర్తి కలిసి నటిస్తున్న చిత్రమిదే. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. తమిళ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి ద‌శ‌కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మూవీని 2023 మార్చిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం. దీనిని  తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని తదితరులు కీల‌క పాత్ర‌ల‌ు పోషిస్తున్నారు.



Also Read: Kantara vs Godfather : కాంతారా దెబ్బకు గాడ్ ఫాదర్ గూటికి.. ఇక చిరంజీవి పని అంతేనా?.. రిషభ్ శెట్టికి ఎదురులేదా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook