Kantara : తెలుగు సినిమాలపై కాంతారా దెబ్బ.. ఈ వారం రిషభ్ శెట్టికి ఎదురులేదా?

Kantara Collections :  కాంతారా సినిమాకు మొదటి రోజు  మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఒకరకంగా తెలుగులో అన్ని సినిమాల కంటే ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టినట్టు అయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2022, 05:03 PM IST
  • తెలుగులో కాంతారా ప్రభంజనం
  • గాడ్ ఫాదర్‌ను వెనక్కి నెట్టిన కన్నడ చిత్రం
  • చిరంజీవి సినిమాపై రిషభ్ శెట్టి ప్రభావం
Kantara : తెలుగు సినిమాలపై కాంతారా దెబ్బ.. ఈ వారం రిషభ్ శెట్టికి ఎదురులేదా?

Kantara Collections : కాంతారా సినిమాకు తెలుగులో వస్తోన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్నడలో ఈ కాంతారా సినిమాకు మొదటి రోజు కేవలం రెండు కోట్ల వరకు వసూళ్లు వస్తే.. మన తెలుగులో మొదటి రోజు దాదాపు ఐదు కోట్ల గ్రాస్.. రెండున్నర కోట్ల షేర్ వచ్చింది. అది కూడా కన్నడలో సెప్టెంబర్ 30న విడుదలైంది. తెలుగులో అక్టోబర్ 15న విడుదలైంది. అయినా కూడా కాంతారా తెలుగులో బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది.

 అసలు ఈ వారం ఇబ్బడి ముబ్బడి చిన్న చిత్రాలు వచ్చాయి. బాయ్ ఫ్రెండ్ ఫర్ హయర్, క్రేజీ ఫెలో వంటి సినిమాలున్నాయి. ఇక అంతకు ముందు వచ్చిన గాడ్ ఫాదర్, పొన్నియిన్ సెల్వన్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వీటిపై కాంతారా దెబ్బ పడ్డట్టు కనిపిస్తోంది. రెండో వారంలో చిన్న సినిమాలు ఉండటంతో గాడ్ ఫాదర్‌కు ఎదురులేదని అంతా భావించారు. కానీ అల్లు అరవింద్ మాస్టర్ మైండ్ పని చేసింది. కాంతారా సినిమాను తెలుగులో మెల్లిగా రిలీజ్ చేశారు.

కాంతారా మీద అప్పటికే ఉన్న క్రేజ్, బజ్ కలిసి వచ్చింది. అలా ఈ కాంతారాకు తెలుగులో మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా అదిరిపోయాయి.  అదిరిపోయిన టాక్, రిషభ్ శెట్టి నటనకు తెలుగు వారు ఫిదా అయ్యారు. అందుకే ఈ రేంజ్ కలెక్షన్లను కట్టబెట్టేస్తున్నారు. ఇక రెండో రోజు సైతం ఈ చిత్రం అదరగొట్టేసినట్టు తెలుస్తోంది.

మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది. మినిమం ఐదు కోట్ల గ్రాస్ వచ్చేసిందని తెలుస్తోంది. అలా చివరకు కాంతారా మొదటి రోజు కలెక్షన్లతో జోరు చూపించడం చూస్తుంటే ఈ కాంతారా దెబ్బకు దీపావళి సినిమాలు కూడా ఉంటాయా? అన్నది డౌటే. అసలే ఈ వారం ప్రిన్స్, సర్దార్, ఓరి దేవుడా అంటూ ఇలా చాలా సినిమాలే క్యూ కట్టాయి. కానీ కాంతారా దెబ్బకు అవన్నీ నిలబడటం కష్టమే అనిపిస్తోంది.

Also Read : Sreemukhi Hot Photos: ఎద అందాలు దాచలేక శ్రీముఖి కష్టాలు.. జిగేల్ మనిపిస్తున్న రాములమ్మ!

Also Read : Nayanthara Marriage: సరోగసీ వివాదంలో కొత్త ట్విస్ట్.. ఆరేళ్ల క్రితమే నయనతార పెళ్లి.. పిల్లల్ని కన్న మహిళ ఎవరంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News