యష్ ( KGF Yash ) ప్రధాన పాత్రలో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 1 ( KGF Chapter 1) చిత్రం జాతీయ స్థాయిలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ సినీ పరిశ్రమకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమా సంబంధించిన వసూళ్లు, విజయాన్ని గమనించిన దర్శక నిర్మాతలు కేజీఎప్ చాప్టర్ 2 ( KFG Chapter 2 ) ని మరింత భారీ బడ్జెట్ తో, జాతీయ స్థాయి నటులతో తెరకెక్కిస్తున్నారు. అయితే కరోనావైరస్ (  Coronavirus ) వల్ల ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల చేయాలి అనుకున్న సినిమా వాయిదా పడింది. కేవలం 15 శాతం షూటింగ్ మిగిలి ఉంది అని దర్శకుడు ప్రశాంత్ నీల్  తెలిపాడు. అది కూడా త్వరలో ప్రారంభిస్తాం అన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read This Story : Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు


కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా మిగిలిన షూటింగ్ ను ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నారట. దీని కోసం యష్ అండ్ ప్రశాంత్ నీల్ ( Prashant Neel ) తమ టీమ్ ను సిద్ధం చేస్తున్నారట. కొన్ని కీలక సన్నివేశాలు, పతాక సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అని.. అందులో కొన్నింటిని రామోజీ ఫిలిం సిటీలో ( KGF In Ramoji Film City ) షూట్ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఫస్ట్ లైన్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అని.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ మూవీని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ బావిస్తోందని సమాచారం. కాగా కేజీఎఫ్ చాప్టర్ 2లో బాలీవుడ్ నటులు సంజయ్ దత్ ( Sanjay Dutt In KGF ), రవీనా టాండన్ ( Raveena Tandon In KGF ) నటిస్తున్న విషయం తెలిసిందే.


Read This Story: Cleopatra Beauty: క్లియోపాత్ర అందంగా కనిపించడానికి ఏం చేసేదో తెలుసా ? మీరూ ట్రే చేయండి