Pan-Indian Actress: సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులు ఎందరో ఉన్నారు. హీరో, హీరోయిన్లు కాకముందు.. వెయిటర్లుగా, కండక్టర్లుగా ,టీచర్లుగా పనిచేసిన వాళ్ళు ఎందరో. కొంతమంది యాక్టర్ లు కెరీర్ తొలి దశలో నిడదొక్కుకోవడం కోసం ఒకపక్క నటిస్తూ మరొక పక్క చిన్నాచితకా పనులు చేయడానికి కూడా వెనకాడరు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమ కెరియర్ మొదలుపెట్టి మెల్లిగా ఎదిగిన నటులు ఎందరో ఉన్నారు. ఇలాగే ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సినిమాలోకి రాకముందు ఫ్లోర్ క్లీన్ చేసేదట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా.. ఆమె మరెవరో కాదండి ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్. పట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత సుకుమారంగా కనిపించే రవీనా టాండన్ ఒకప్పుడు  బాత్రూములు కూడా కడిగిందట. రీసెంట్ గా యస్ కేజిఎఫ్ 2 లో ప్రధానమంత్రి పాత్రలో నటించి అందరినీ మెప్పించింది ఈ బ్యూటీ. సినీ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికి.. రవీనా టాండన్  హీరోయిన్ కావడానికి ముందు ఎన్నో పనులు చేసిందట. ఆమె తండ్రి రవి టెండర్ బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న డైరెక్టర్, నిర్మాత.


ఇండస్ట్రీలోకి రాకముందు.. కాలేజీలో చదువుకునే రోజుల్లో రవీనా..జెనెసిస్‌ పీఆర్‌లో ఇంటర్న్‌షిప్‌కు వెళ్లారు. అక్కడ ఆడ్ డైరెక్టర్ గా పని చేస్తున్న ప్రహ్లాద కక్కర్ కు ఆమె హెల్ప్ చేసేవారట. ఈ నేపథ్యంలో అక్కడ ఫ్లోర్స్ క్లీన్ చేయడం..ఎవరైనా వాంతి చేసుకుంటే శుభ్రం చేయడం లాంటివి చేసేవారట. ఆమె ఫ్రెండ్స్ మాత్రం ఇంత అందంగా ఉన్నావు. హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా అని సలహా ఇచ్చేవారట.


అయితే రవీనాకు మొదటినుంచి కూడా తాను యాక్టర్ ని అవుతాను అన్న నమ్మకం లేదట. అందుకే అప్పట్లో తాను హీరోయిన్గా పెద్దగా ట్రై చేయలేదు. అయితే తనలో ఉన్న మోడల్ ని గుర్తించింది శాంతను షీరే అనే ఫొటోగ్రాఫర్‌ అని రవీనా వెల్లడించారు. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రం సల్మాన్ ఖాన్ తో చేసిన పత్తర్ కే ఫూల్ మూవీ. హీరోయిన్ కావడానికి ముందు ఇలాంటి పనులు చేసే దాన్ని అని స్వయంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. కాగా అలా ఫ్లోర్ క్లీనింగ్ తో తన కెరియర్ మొదలుపెట్టిన రవీనా ఆ తరువాత టాలీవుడ్ లో బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో కనిపించింది. ఈ మధ్యనే కేజిఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లో కూడా ముఖ్యపాత్రలో కనిపించి మెప్పించింది.


Also read: AP & TS SSC Exams 2024: నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook