AP & TS SSC Exams 2024: ఏపీ, తెలంగాణల్లో ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. ఇవాళ్టి నుంచి ఈ నెలాఖరు వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఏపీలో మొత్తం 7,25,620 మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 6,23,092 మంది కాగా ఈ ఏడాది తిరిగి అడ్మిషన్ తీసుకుని రాస్తున్నవారు 1,02,528 మంది ఉన్నారు. ఉదంయ 9.30 గంటల్నించి మద్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షల జరుగుతాయి. 8.45 గంటల వరకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తరువాత ప్రత్యేక సందర్భాల్లోనే మరో 30 నిమిషాలు అనుమతి ఉంటుంది. కానీ గ్రేస్ పీరియడ్ ఇవ్వలేదు. మొత్తం 3,473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
ఆర్టీసీ బస్సుల్లో విద్యార్ధులకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించారు. పరీక్షా కేంద్రాలన్నీ నో పోన్ జోన్‌గా ప్రకటించారు. మాస్ కాపీయింగ్ కట్టడికి ప్రత్యేక డిజిటల్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 8 వరకూ స్పాట్ వాల్యుయేషన్ ఉంటుంది. ఆ తరువాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రతి పరీక్షా పత్రానికి ప్రత్యేకమైన క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. లీక్ అయితే ఎక్కడ్నించి ఎలా లీక్ అయిందో వెంటనే తెలిసిపోతుంది.
ఇక తెలంగాణలో కూడా ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,08,385 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మద్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే ఫిజిక్స్, బయోలజీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల్నించి 11 గంటల వరకూ జరగనున్నాయి. ఐదు నిమిషాలు గ్రేస్ సమయం ఇచ్చారు. గత ఏడాది పరీక్ష పత్రాలు లీకైన నేపధ్యంలో ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే సిబ్బంది, తనిఖీలకు వచ్చే అధికారులు, స్క్వాడ్ కూడా ఫోన్లు బయటే పెట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Also read: Loksabha Elections Impact: పరీక్షలపై లోక్‌సభ ఎన్నికల ప్రభావం, ఏయే పరీక్షలు వాయిదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook