KGF 2 DAY1 COLLECTIONS: చరిత్ర సృష్టించిన రాఖీ భాయ్.. మొదటి రోజే రూ. 135 కోట్లు
KGF 2 DAY1 COLLECTIONS: భారీ అంచనాల నడుమ విడుదలైన కన్నడ హీరో యాష్ నటించిన కేజీఎఫ్ 2 చిత్రం సంచనాలు సృష్టిస్తుంది. విడుదలైన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.135 కోట్లు కలెక్షన్ లను రాబట్టి చరిత్ర సృష్టించింది.
KGF 2 DAY1 COLLECTIONS: భారీ అంచనాల నడుమ విడుదలై దూసుకెళ్తున్న కేజీఎఫ్ 2 చిత్రం భారీగా ఓపెనింగ్స్ రాబట్టింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ అద్భుత నటనకు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఏ మాత్రం అంచనాలు లేకుండా ఒక ప్రాంతీయ భాష చిత్రంగా విడుదలైన కేజీఎఫ్ 1 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్‍గా వచ్చిన కేజీఎఫ్ 2 అంతకు మించిన క్రేజ్‌తో థియేటర్లలో దూసుకెళ్తోంది. విడుదలకు ముందే ప్రి బుకింగ్స్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఏప్రిల్ 14న విడుదలై.. మొదటి రోజే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 మొదటి రోజే రూ. 135 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని సమాచారం అందుతోంది. కేజీఎఫ్ హిందీలో తొలి రోజు వసూళ్లు రూ. 50 కోట్లు దాటినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కేజీఎఫ్2.. రూ. 33 కోట్లు రాబట్టింది. కర్ణాటక, తమిళనాడు, కేరళలో మొత్తం కలిపి రూ. 50 కోట్ల వరకు వసూలు చేసింది. మొత్తంగా దేశవ్యాప్తంగా కేజీఎఫ్2 రూ. 150కోట్లు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
గరుడను చంపిన రాకీభాయ్ కేజీఎఫ్‌ను ఏలటానికి ఏమేం చేశాడు. చివరికి బంగారం ఎక్కడికి చేర్చాడు. అనే కథాంశంతో... యష్ ఆద్యంతం ఆకట్టుకునేలా నటించి ప్రేక్షకులతో విజిల్స్ వేయించాడు. రాఖీభాయ్‌గా యష్ కనిపించినప్పుడల్లా ప్రేక్షకులు ఎగ్జయిట్ అయేలా సీన్స్ తెరకెక్కించాడు నీల్.
కేజీఎఫ్ చాప్టర్ 1 కు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 లో బాలీవుడ్ నటులు రవీనా టాండన్, సంజయ్ దత్ లతో పాటు సౌత్ స్టార్స్ ప్రకాష్‌రాజ్, ఈశ్వరీ రావు, రావు రమేష్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి భువన్ గౌడ ఛాయాగ్రహణం అందించగా.. ఉజ్వల్ కులకర్ణి ఎడిట్ చేశారు. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమాని.. హిందీ, తమిళ, తెలుగు, మళయాళ భాషలలో డబ్ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్స్‌పై కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల అవ్వగా.. ఇండియాలో 6వేలు మరియు దక్షిణాదిలో 2600 థియేటర్లలో విడుదల చేశారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాని ఏపీ, తెలంగాణ పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేశారు. ప్రముఖ ఛానెల్ ఈ సినిమాని రూ.30కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
Also Read: Liquor Shops Hyderabad: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్!
Also Read: Tata Play 49 Plan: టాటా ప్లే DTH బంపర్ ఆఫర్.. రూ.49లకే ప్రముఖ OTTల సబ్‌స్క్రిప్షన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook