KGF Chapter 2 Bags 90+ Ormax Power Rating: కన్నడ సినీ పరిశ్రమ నుంచి మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన సినిమా కేజిఎఫ్. యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా 2018 సంవత్సరం చివరి భాగంలో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని కూడా భారీ అంచనాలతో రూపొందించారు మేకర్స్. అయితే కరోనా కారణంగా ఈ సినిమ చాలా ఆలస్యంగా విడుదలయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి అద్భుతమైన మౌత్ టాక్ తో అలాగే మంచి రెస్పాన్స్ దక్కించుకుని అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పటికే సుమారు 1200 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా కేవలం హిందీ వర్షన్ లోనే 430 కోట్లు కలెక్షన్స్ సాధించిందంటే నార్త్ ఆడియన్స్ కి కూడా ఎంతగా కనెక్ట్ అయింది అని అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే కలెక్షన్ల విషయంలో అలాగే మిగతా విషయాల్లో కూడా అనేక రికార్డులు బద్దలు కొట్టిన కేజిఎఫ్ 2 సినిమా ఇప్పుడు మరో రికార్డు బద్దలు కొట్టినట్లు సమాచారం.


ఇప్పటివరకు లేని రికార్డును కేజిఎఫ్ సినిమా సృష్టించినట్లు చెబుతున్నారు. గత కొన్నాళ్లుగా ఆర్మాక్స్ మీడియా అనే సంస్థ సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ చేస్తున్న సర్వేలు, ఇస్తున్న పోల్ రిజల్ట్స్ తో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తాజాగా ఈ సంస్థలోనే 90 ప్లస్ పవర్ రేటింగ్స్ సాధించిన మొట్ట మొదటి సినిమాగా కేజిఎఫ్ 2 రికార్డులకు ఎక్కింది. ఈ విషయాన్ని తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ అధికారికంగా ప్రకటించింది.


KGF 2 మరే ఇతర భారతీయ సినిమా చేయని రికార్డును సృష్టించింది. ఆర్మాక్స్ మీడియా ఇచ్చిన రేటింగ్‌లో, 'KGF 2' చిత్రం విడుదలైన మొత్తం 5 భాషలలో 90+ (100కి) రేటింగ్‌ను పొందింది. ఓర్మాక్స్ పవర్ రేటింగ్‌లో ఏ భారతీయ సినిమా కూడా ఈ ఘనత సాధించలేదు. ఇక ఈ రేటింగ్ సినిమా చూసిన సాధారణ ఆడియన్స్ ఇస్తారని ఆర్మాక్స్ మీడియా వెల్లడించింది. 
 Also Read: The Warriorr day 1 collections: ఇస్మార్ట్ శంకర్ రికార్డ్ బద్దలు కొట్టలేకపోయిన రామ్.. ది వారియర్ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?


Also Read: Kiraak RP Jabardasth: కిరాక్ ఆర్పీ సినిమా అందుకే ఆగింది.. అసలు ఫ్రాడ్ బయటపెట్టిన ఏడుకొండలు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌ స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook