KGF 2 Trailer: కేజీఎఫ్ 2 ట్రైలర్ రక్తంతో రాసిన కథ ఇది.. `నాకు ఎవ్వడి దోస్తీ అక్కర్లేదు`!
KGF 2 Trailer: దేశవ్యాప్తంగా సినీ ప్రియులు కేజీఎఫ్2 సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఆసక్తి రేపే డైలాగ్స్‌తో.. ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మరి ఆ ట్రైలర్ మీరూ చూసేయండి.
KGF 2 Trailer: దేశంలో ఇప్పుడు పాన్ ఇండియా మూవీల హవా నడుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై.. సంచలనం సృష్టిస్తుండగా.. ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్-2 ట్రైలర్ విడుదలైంది. కేజీఎఫ్ సృష్టించిన సంచలనంతో.. దానికి కొనసాగింపు అయిన కేజీఎఫ్-2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ట్రైలర్ ఆరంభం నుంచి ముంగింపు వరకు అదిరే డైలాగ్స్‌తో సాగుతుంది. రెండో భాగాన్ని ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్‌తో కంటిన్యూ చేయనున్నట్లు ఇందులో రివీల్ అయ్యింది. 'రక్తంతో రాసిన కథ ఇది.. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్స్ ఆసక్తి రేపుతున్నాయి.
ఇక అదిరా చెప్పే.. 'కత్తి విసిరి.. రక్తం చిందించి యుద్ధం చేసేది.. నాశనానికి కాదు.. ఉద్దరించడానికి. అక్కడ పడే పీనుగులు కూడా పనికొస్తాయి. కావాలంటే.. రాబందులనడుగు' అనే డైలాగ్స్ మరో లెవల్లో ఉన్నాయి.
'హీ ఇజ్ద బిగ్గెస్ట్ క్రిమినల్.. హీ ఇజ్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్.. దిస్ ఇజ్ ద బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ' అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఇక.. రాఖీ (యశ్) చెప్పే డైలాగ్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్.. నాకు నచ్చదు. దానిని నేను పక్కన పెడతాను. కానీ వైలెన్స్‌కు నేనంటే ఇష్టం. అందుకే నేను దానిని నేను వదలలేను అంటూ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్. ఇక 'నాకు ఎవ్వడి దోస్తీ అక్కర్లేదు.. నాతో దుష్మని ఎవ్వడూ తట్టుకోలేడు' అని చెప్పే చివరి డైలాగ్.. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా.. ఎప్పుడు చూసేద్దామా.. అనే ఉత్కంఠను పెంచేస్తున్నాయి. కేజీఎప్-2 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.
Also read: Pooja Hegde: టైట్‌ఫిట్ అథ్లెటిక్ డ్రెస్‌తో మెరుస్తున్న రాధేశ్యామ్ హీరోయిన్ పూజా హెగ్డే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook