KGF 2 vs Pushpa 2: కేజీఎఫ్ 2 ప్రభావం పుష్ప రెండవ భాగంపై ఉంటుందా..సుకుమార్ ఏం చేయనున్నాడు
KGF 2 vs Pushpa 2: పాన్ ఇండియా సీక్వెల్ మూవీస్ ట్రెండ్ నడుస్తోందిప్పుడు. రికార్డుల హోరు సృష్టిస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రభావం..ఇతర సీక్వెల్ సినిమాలపై పడుతుందనే ఆందోళన నెలకొంది. నిజం కూడా కావచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
KGF 2 vs Pushpa 2: పాన్ ఇండియా సీక్వెల్ మూవీస్ ట్రెండ్ నడుస్తోందిప్పుడు. రికార్డుల హోరు సృష్టిస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రభావం.. ఇతర సీక్వెల్ సినిమాలపై పడుతుందనే ఆందోళన నెలకొంది. నిజం కూడా కావచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పాన్ ఇండియా సీక్వెల్ సినిమాగా విడుదలైన కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఎంతటి హోరు సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ 2 రికార్డుల మోత మోగిస్తోంది. ఉత్తరాది, దక్షిణాది తేడా లేకుండా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇటీవలి కాలంలో బాక్సాఫీసును మోత మోగిస్తున్న పాన్ ఇండియా సినిమాలన్నీ దక్షిణాదివే కావడం విశేషం. మొన్న పుష్ప పార్ట్ 1, నిన్న ఆర్ఆర్ఆర్..ఇప్పుడు కేజీఎప్ ఛాప్టర్ 2. ఇందులో ఆర్ఆర్ఆర్ తప్ప మిగిలినవి రెండూ సీక్వెల్ సినిమాలే. అందుకే కేజీఎఫ్ 2 ప్రభావం పుష్ప 2పై పడనుందనేది ఓ వాదన. దీనికి కారణాలు లేకపోలేదు.
కేజీఎఫ్ 1 కంటే కేజీఎఫ్ 2లో కధ గానీ, కధనం గానీ, హీరోని ఎలివేట్ చేసిన తీరు గానీ అద్భుతంగా ఉన్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే..కేజీఎఫ్ 1 కంటే కేజీఎఫ్ 2 రేంజ్ బాగుంది. కేజీఎఫ్ ఛాప్టర్ 2లో కధ, హీరో యశ్ ఎలివేషన్ పీక్స్‌లో ఉన్నాయి. ఒకవేళ కేజీఎఫ్ 1 కంటే కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఏ మాత్రం బాగాలేకున్నా..ఇంతటి కలెక్షన్లు వచ్చేవి కావు. సగటు ప్రేక్షకుడు కూడా మొదటి భాగం చూసిన తరువాత..రెండవ భాగంపై భారీగా అంచనాలు పెట్టుకుంటాడు. ఆ అంచనాల్ని ఆ సినిమా చేరుకున్నప్పుడే అది హిట్ అవుతుంది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 విషయంలో ఆ అంచనాలు చేరుకున్నాయి. అందుకే రికార్డుల మోత మోగిస్తోంది.
ఇప్పుడీ సినిమా ప్రభావం పుష్ప సీక్వెల్‌పై కచ్చితంగా పడనుందనే తెలుస్తోంది. పుష్ప మొదటి భాగం చూసిన ప్రేక్షకుడు..కేజీఎఫ్ రెండు సీక్వెల్స్‌తో పోల్చుకుని భారీ అంచనాలు పెట్టుకుంటాడు. ఆ అంచనాల్ని పుష్ప 2 మీట్ కావల్సిందే. అంటే పుష్ప 2లో అల్లు అర్జున్ ఎలివేషన్, కధ, కధనం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఈ అన్ని అంశాలు ఇప్పుడు దర్శకుడు సుకుమార్‌కు కత్తి మీద సామే. పుష్ప రెండవ భాగం పుష్ప ది రూల్‌లో అల్లు అర్జున్ ఎర్రచందనం మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా నడిపిస్తాడు, పోలీసాఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ , మంగళం శ్రీనుల్ని ఎదుర్కొనే విధానం ఎలా ఉంటుందనేది ఊహించని విధంగా ప్రేక్షకుడి అంచనాను దాటి మల్చాల్చిన అవసరముంది. అంతకుమించి కధనం, కధ ఆసక్తికరంగా ఉండాలి. ఈ అంచనాల్ని దృష్టిలో ఉంచుకుని సుకుమార్..సినిమా నడిపించాల్సిన పరిస్థితి.
ఇక సుకుమార్ కూడా పుష్ప 2 విషయంలో తగ్గేదే లే అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నట్టు కన్పిస్తోంది. పుష్ప 2లో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నాడనే వార్త విన్పిస్తోంది. ఏదేమైనా కేజీఎఫ్ 2 వర్సెస్ పుష్ప 2 ఉంటేనే రక్తి కడుతుందనేది సగటు ప్రేక్షకుడి అంచనా.
Also read: Balaiah: బాలయ్యకు సర్జరీ ఎందుకు చేశారు..ఏమైంది అసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.