KGF 2 teaser: కేజీఎఫ్ 2 టీజర్ వరల్డ్ రికార్డ్
KGF చాప్టర్ 2 టీజర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. కేజీఎఫ్ స్టార్ యష్ బర్త్ డే సందర్భంగా విడుదలైన కేజీఎఫ్ 2 మూవీ టీజర్ 2 రోజుల్లో యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది.
KGF చాప్టర్ 2 టీజర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. కేజీఎఫ్ స్టార్ యష్ బర్త్ డే సందర్భంగా విడుదలైన కేజీఎఫ్ 2 మూవీ టీజర్ 2 రోజుల్లో యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ట్రేడ్ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం కేజీఎఫ్ 2 టీజర్ కేవలం ఇండియన్ సినిమాలోనే కాదు... ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నెటిజెన్స్ వీక్షించిన సినిమా టీజర్‌గా మారింది. కేవలం 2 రోజుల్లో పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాల టీజర్స్‌ని దాటుకుని కేజీఎఫ్ 2 టీజర్ ఈ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. టీజర్ విడుదలైనప్పటి నుండి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
ఇప్పటివరకు, KGF చాప్టర్ 2 టీజర్ 5.6 మిలియన్లకు పైగా లైక్‌లతో 105 మిలియన్ యూట్యూబ్ వీక్షణలను సొంతం చేసుకుంది. ఈ టీజర్ హాలీవుడ్ మూవీ టీజర్‌లైన ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ (89 మిలియన్లు), ఇన్‌క్రెడిబుల్స్ 2 (89 మిలియన్లు) ను దాటేసింది. KGF టీజర్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉందని మూవీ యూనిట్ అంచనాలు వేస్తోంది.
Also read : Actress Pranitha Subhash: ప్రణీత సుభాష్‌కి కాబోయే భర్త ఇలా ఉండాలంట
కేజీఎఫ్ 2 సినిమా టీజర్‌లో యష్ హీరోయిజాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashant Neel ) చూపించిన విధానం అభిమానులను బాగా ఆకర్షించింది. కేజీఎఫ్ 2 మూవీ టీజర్ యూట్యూబ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయి ట్రెండ్ సెట్ చేయడంతో నటుడు యశ్‌కి ( KGF 2 actor Yash ) సైతం మరింత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కేజీఎఫ్ మూవీతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై తనకు అంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యశ్.. ఈ సీక్వెల్ టీజర్‌తో ( KGF Chapter 2 teaser ) తన రేంజ్ మరింత పెంచుకున్నాడు. విజయ్ కిరాగండూర్ నిర్మిస్తున్న ఈ సినిమా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మైనింగ్ మాఫియా నేపథ్యంతో తెరకెక్కుతోంది.