Prasanth Neel: హ్యాపీ బర్త్‌డే ప్రశాంత్ నీల్, సందడి చేసిన యశ్, ప్రభాస్
Prasanth Neel: కేజీఎఫ్ సినిమాతో ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ దర్శకుడి పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా కేజీఎఫ్ హీరో యశ్..ప్రభాస్‌లు బర్త్‌డే పార్టీలో సందడి చేశారు.
Prasanth Neel: కేజీఎఫ్ సినిమాతో ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ దర్శకుడి పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా కేజీఎఫ్ హీరో యశ్..ప్రభాస్‌లు బర్త్‌డే పార్టీలో సందడి చేశారు.
కేజీఎఫ్ సినిమా రాకముందు అతడొక సామాన్య దర్శకుడు. కేజీఎఫ్ బ్లాక్ బస్టర్‌తో పేరు మార్మోగిపోయింది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 సక్సెస్‌తో ఇక ప్రపంచవ్యాప్తమయ్యాడు. ఆ క్రేజీ దర్శకుడు బర్త్‌డే ఇవాళ జూన్ 4వ తేదీన. ఈ సందర్భంగా క్రేజీ దర్శకుడి పుట్టినరోజు వేడుకల్ని ఇద్దరు క్రేజీ హీరోలు కలిపి జరిపారు. కేజీఎఫ్ హీరో యశ్..ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా హీరో ప్రభాస్‌లు బెంగుళూరులో కలుసుకున్నారు. ప్రశాంత్ నీల్ బర్త్‌డే సెలెబ్రేషన్స్ జరిపారు.
ఈ బర్త్‌డే సెలెబ్రేషన్స్ ఫోటోల్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర నటులు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు వేడుకల కోసం ఓ చోట కలిశారు. ఇదే పార్టీలో కేజీఎఫ్ ఛాప్టర్-2 సినిమా 50 రోజుల వేడుక కూడా జరిగింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ పాన్ ఇండియా మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్, యశ్ సందడి చేసిన ప్రశాంత్ నీల్ బర్త్‌డే వేడుకల ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also read: NTR 31: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook