NTR 31: ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్!

NTR 31:  క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఎన్టీఆర్ 31 సినిమా టైటిల్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.    

Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 4, 2022, 01:06 PM IST
NTR 31: ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్!

Jr NTR- Prashanth Neel Movie Title News: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (jr ntr) ఆర్ఆర్ఆర్ (RRR) సక్సెస్ తర్వాత రెండు భారీ ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి కొరటాల డైరెక్షన్‌‌లో, మరోకటి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో(Prashanth Neel) చేయబోతున్నాడు. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోపై ఫ్యాన్స్ కు భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే కేజీఎఫ్ 2 (kgf 2)తో వెయ్యి కోట్ల వసూలు చేసిన నీల్.. యంగ్ టైగర్ తో ఎంత వసూలు చేస్తాడోనని అభిమానులు అతృతగా ఉన్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ 31 (NTR 31) సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్ట్రింగ్ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేశారన్న న్యూస్ నెట్టింట చక్కెర్లు కొడుతోంది. 

ఇప్పటికే ఎన్టీఆర్ 31 సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రానికి  ఓ మంచి పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు 'అసుర' లేదా 'అసురుడు' అనే టైటిల్​ పెట్టాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇదే టైటిల్ ని ఫిక్స్ చేస్తే బావుంటుందని భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ మూవీ ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళుతుందని టాక్ నడుస్తోంది. 

Also Read: Doctor Strange 2: డాక్టర్ స్ట్రేంజ్ సీక్వెల్ ఓటీటీ విడుదల ఎప్పుడంటే.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News