Kiccha Sudeep Condemns attack on Hero Darshan: కన్నడ హీరో దర్శన్ మీద చెప్పు దాడి జరగడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన క్రాంతి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కర్ణాటకలోని హోస్పేటలో సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే ఆయన మీద చెప్పు దాడి జరిగింది. వెహికల్ మీద ఉన్న ఆయన మీదకు చెప్పుతో విసిరేయడంతో ఆ చెప్పు వెళ్లి భుజానికి తగిలింది, ఈ క్రమంలో కన్నడ సినీ పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఆయన మీద దాడి చేసింది పునీత్ ఫాన్స్ అని ఒక టాక్ ఉండడంతో దీన్ని ఖండిస్తూ శివ రాజ్ కుమార్ ఒక వీడియో కూడా విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి కొద్ది రోజుల క్రితం మహిళలను కించపరిచే విధంగా విమర్శలు చేసినట్లు దర్శన్  పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపద్యంలోనే ఆయన మీద చెప్పు దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. అదృష్ట దేవత స్వయంగా ఇంటికి వస్తే వెంటనే దుస్తులు విప్పి ఇంట్లో బంధీ చేయాలి. ఎందుకంటే మీరామెకు బట్టలు ఇచ్చేస్తే ఆమె వేరే చోటికి వెళ్ళిపోతుంది కదా అంటూ ఆయన చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ఈ విషయం మీద మహిళలు, మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చెప్పు దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే పునీత్ ఫాన్స్ కు దర్శన్ కు కాస్త గ్యాప్ ఉండడంతో వారే చేసి ఉండవచ్చనే వాదన కూడా ఉంది. ఈ విషయం మీద కన్నడ సినీ ప్రముఖులు చాలామంది ఖండిస్తున్నారు.


తాజాగా ఇదే విషయం మీద కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా స్పందిస్తూ సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. ఇలా దాడులు చేయటం సమాధానం కాదంటూ ఆయన పేర్కొన్నారు. మనం నివసించే మన భూమి, భాష మన కల్చర్ మనకి అన్ని విషయాల్లోనూ ప్రేమగా ఉండాలని గౌరవం ఇవ్వాలని నేర్పించాయని ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుందని ఒక్క సొల్యూషన్ కూడా కాదు అనేక దారుల్లో మనం దాన్ని సాల్వ్ చేయొచ్చని పేర్కొన్నారు. ప్రతి మనిషికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన ఎలాంటి సమస్య ఉన్న దాన్ని మాట్లాడి పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. తాను చూసిన వీడియో చాలా డిస్టర్బ్ కలిగించే విధంగా ఉందని ఎప్పుడో గతంలో జరిగిన విషయం మీద ఇలా ఒక పబ్లిక్ ఈవెంట్ లో దాడి చేయడం అనేది కరెక్ట్ గా అనిపించడం లేదని దీన్ని వేరే రాష్ట్రాల వారు చూస్తే కన్నడ వారు ఇలా ప్రవర్తిస్తారా అని అనుకునే ప్రమాదం ఉందని ఆయన కామెంట్ చేశారు.


దర్శన్ చెబుతున్నట్లుగా ఆయనకు పునీత్ ఫ్యాన్స్ మధ్య పరిస్థితులు అంతగా బాగా లేవని కానీ పునీత్ ఉండి ఉంటే ఇలాంటి రియాక్షన్ ని ఆయన సమర్థిస్తారా? మెచ్చుకుంటారా? అనేది ఆలోచించాలని అన్నారు. గుంపులో ఉన్న ఒక్కరు చేసిన ఈ పని మొత్తం సిస్టం మీద ప్రేమ గౌరవాన్ని తగ్గించలేదని పునీత్ అభిమానుల మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని కూడా తీసివేయలేదని పేర్కొన్నారు. దర్శన్ మన సినీ పరిశ్రమకు మన భాషకు ఎంతో సేవ చేశాడు మన మధ్య ఉన్న ఇబ్బందుల వల్ల నేను అనుకుంటున్న విషయాన్ని చెప్పకుండా ఉండలేను ఆయన మీద ఇలా చేయకుండా ఉండాల్సింది ఈ విషయాలు నన్ను కూడా చాలా డిస్టర్బ్ చేశాయి. మన సినీ పరిశ్రమ అన్న, మనవారన్న ఇతర భాషలో వారు చాలా గౌరవిస్తారు కానీ ఇలాంటి చర్యలు మనకున్న మంచి పేరును చెడగొడతాయి.


నటుల మధ్య నటుల అభిమానుల మధ్య కొంచెం దూరం ఉంటుందని అర్థం చేసుకోగలను అలాగే ఈ విషయంలో నేను ఎవరిని? ఇలా బయటకొచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. అయితే నాకు పునీత్ దర్శన్ ఇద్దరూ చాలా దగ్గర వారే అందుకే ఈ విషయం మీద స్పందించాలని అనుకున్నానని ఆయన పేర్కొన్నారు. నేను ఎక్కువ మాట్లాడాను అనుకుంటే క్షమించండి సినీ పరిశ్రమలో 27 ఏళ్లు ప్రయాణం చేసిన వ్యక్తిగా నేను ఒకటి అర్థం చేసుకున్నాను, ఇక్కడ ఎవరు, ఏది శాశ్వతం కాదు ఖచ్చితంగా ప్రేమ, గౌరవం మనం ఇస్తే మనకి అవే తిరిగి వస్తాయి, అవి మాత్రమే మన పేరుని చెడగొట్టకుండా ఉంటాయని కిచ్చా సుదీప్ పేర్కొన్నారు.


 


 

 Also Read: BookMyShow: 2022 బుక్ మై షో టాప్ టెన్ సినిమాలివే.. తెలుగు నుంచి ఒక్కటే కానీ?


Also Read: Bandla Ganesh: ఫిలిం జర్నలిస్టుపై బండ్ల గణేష్ దారుణ ట్వీట్లు.. ఒక రేంజ్ లో రెచ్చిపోయి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.