BookMyShow: 2022 బుక్ మై షో టాప్ టెన్ సినిమాలివే.. తెలుగు నుంచి ఒక్కటే కానీ?

  2022 Top Movies on BookMyShow: ఇప్పుడు ఎక్కువగా టికెట్లను జనం బుక్ మై షో యాప్ ద్వారానే బుక్ చేసుకుంటున్నారు, తాజాగా బుక్ మై షో సంస్థ 2022కు గాను టాప్ 10 సినిమాల లిస్టును విడుదల చేసింది. 

Last Updated : Dec 19, 2022, 10:51 PM IST
BookMyShow: 2022 బుక్ మై షో టాప్ టెన్ సినిమాలివే.. తెలుగు నుంచి ఒక్కటే కానీ?

Top Movies of 2022 Booked in BookMyShow: ఒకప్పుడు సినిమా టికెట్లు కొనాలంటే థియేటర్ల బయట గంటలు కొలది క్యూలో నుంచి ఉంటే గానీ టికెట్లు దొరికేవి కాదు కానీ ఇప్పుడు బుక్ మై షో, పేటీఎం లాంటి అనేక యాప్స్ వచ్చిన తర్వాత క్షణాల్లో మనకు కావాల్సిన సీటును సైతం బుక్ చేసుకునే అవకాశం దొరికింది. ఒకరకంగా ప్రధాన టికెట్ బుకింగ్ పార్ట్నర్ గా అన్ని థియేటర్లకు మల్టీప్లెక్స్ లకు బుక్ మై షో వ్యవహరిస్తోంది.

సింహభాగం టికెట్లు బుక్ మై షో యాప్ ద్వారానే బుక్ అవుతున్నాయి. ఇక ఈ ఏడాది డిసెంబర్ నెల అంటే ఏడాది చివరకు వచ్చేసిన నేపథ్యంలో బుక్ మై షో ఈ ఏడాది మొత్తం మీద ఎక్కువగా బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ అయిన టాప్ టెన్ మూవీస్ లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్టులో తెలుగు నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా స్థానం దక్కించుకుంది. టాప్ టెన్ సినిమాలు విషయానికి వస్తే కేజీఎఫ్ చాప్టర్ 2 మొదటి స్థానం దక్కించుకోగా ఆర్ఆర్ఆర్ మూవీ రెండో స్థానం దక్కించుకుంది.

కాంతార సినిమా మూడో స్థానం దక్కించుకోగా ది కాశ్మీర్ ఫైల్స్ నాలుగవ స్థానం దక్కించుకుంది. పొన్నియన్ సెల్వన్ సినిమా ఐదవ స్థానం దక్కించుకోగా బ్రహ్మాస్త్ర ఆరవ స్థానం దక్కించుకుంది. ఇక విక్రమ్ సినిమా ఏడవ స్థానంలో నిలవగా భూల్ భూలయ్యా 2 8వ స్థానంలో నిలిచింది.

తర్వాత మల్టీ వర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అనే సినిమా తొమ్మిదో స్థానంలో నిలవగా పదవ స్థానంలో హిందీ దృశ్యం 2 సినిమా నిలిచింది. ఒక రకంగా బాలీవుడ్ నుంచి ఈసారి ఎక్కువ సినిమాలు ఈ టాప్ 10 లో నిలిచాయి తర్వాతి స్థానంలో తమిళ, కన్నడ సినిమాలు నిలిచాయ. ఆయితే కేవలం తెలుగు నుంచి ఒకే ఒక సినిమా స్థానం దక్కించుకోవడం గమనార్హం. 

Also Read: Namrata-Mahesh Deal: పెళ్లికి ముందే ఆ డీల్ చేసుకున్న మహేశ్-నమ్రతా శిరోద్కర్, ఆ డీల్

Also Read: Bandla Ganesh: ఫిలిం జర్నలిస్టుపై బండ్ల గణేష్ దారుణ ట్వీట్లు.. ఒక రేంజ్లో రెచ్చిపోయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 
 

Trending News