Kiraak RP Sensational comments on Jabardasth: తెలుగులో ప్రసారమవుతున్న షోస్ లో జబర్దస్త్ ఎప్పుడూ టాప్ లిస్టులో ఉంటుంది. అది బూతు షో అని కొందరు అంటారు కానీ దాని రేటింగ్స్ మాత్రం ఎప్పుడు తగ్గకుండా నిలకడగా కొనసాగుతూ ఉంటాయి. ఈ షో ద్వారా అనేకమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.  కొంతమంది ఇంకా జబర్దస్త్ ని పట్టుకుని కాలం వెళ్లదీస్తుంటే మరికొందరు సినిమాల్లోకి వెళ్లారు. మరికొందరు ఇతర టీవీ చానల్స్ లోకి వెళ్లి ఇతర షోస్ కూడా చేస్తున్నారు. అలా స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రాంలో ఆర్పీ సందడి చేస్తున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్యకాలంలో ఒక ఎపిసోడ్లో తన గుండెల మీద నాగబాబు పచ్చబొట్టు ఉందనే విషయాన్ని ఆర్పీ వెల్లడించాడు. ఈ సందర్భంగా తన కాబోయే భార్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీ జబర్దస్త్ పైన మల్లెమాల సంస్థ పైన,  దాని యజమాని శ్యాంప్రసాద్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్యాం ప్రసాద్ రెడ్డి చేసేది వ్యాపారం అని పేర్కొన్న కిరాక్ ఆర్పీ నాగబాబు చేసేది మాత్రం వ్యవహారం అని చెప్పుకొచ్చారు. శ్యాం ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్లు ఎవరికీ సహాయం చేయరని కేవలం వ్యాపార దృక్కోణంతో ఆలోచిస్తారని అన్నారు. అదే నాగబాబు మాత్రం అందరికీ తలలో నాలుకలా మెలుగుతూ అందరి సమస్యలను తీరుస్తారని అన్నారు. 


ఇక మల్లెమాల సంస్థలో పెట్టే భోజనం గురించి తనని అడగవద్దని ఎందుకంటే చంచల్గూడా చర్లపల్లి లాంటి జైల్లో కూడా ఇక్కడ పెట్టే భోజనం కంటే మంచి భోజనం పెడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు విషయాల తోనే నాగబాబు పేరు తన గుండెల మీద పొడిపించుకోలేదని అనేక విషయాలలో నాగబాబు తనకు ఎంతో సహాయం చేశారని ఆర్పీ చెప్పుకొచ్చాడు. తనకు కాబోయే భార్య లక్ష్మీ ప్రసన్న ఇంట్లో పెళ్లికి ఒప్పించడం కోసం విశాఖపట్నంలో పిచ్చివాడిలా తిరుగుతున్న సమయంలో కూడా నాగబాబు అండగా నిలబడ్డారని అన్నారు.


నేను రావాలా లేకపోతే మనుషుల్ని పంపించి మాట్లాడాలా అని కూడా అడిగారని అంతటి మంచి వ్యక్తి మరెవరు ఉండరని ఆయన చెప్పుకొచ్చారు. జబర్దస్త్ అనేది కేవలం ఒక కార్యక్రమం,  వారికి మేము ఉపయోగపడుతున్నాం కాబట్టి వారు నాలుగు రాళ్లు సంపాదించుకుని అందులో కొంత మాకు ఇస్తున్నారు అన్నట్లు ఆర్పీ మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయం మీద మల్లెమాల సంస్థ నుంచి ఏదైనా కౌంటర్ వస్తుందేమో వేచి చూడాల్సి ఉంది. 
Also Read: Goutham Raju: గౌతమ్ రాజు కుటుంబానికి చిరంజీవి ఆర్థిక సాయం.. అండగా ఉంటామని హామీ


Also Read: Vk Naresh: నటుడు నరేష్ ముగ్గురు భార్యలు ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు,   వినోదం,   రాజకీయాలు,   విద్య,   ఉద్యోగాలు,   హెల్త్,   లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter ,   Facebook