Kiran Abbavaram Sammathame కిరణ్ అబ్బవరం మీద, ఆయన సినిమాల మీద సోషల్ మీడియాలో ఎప్పుడూ నెగెటివ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్‌ తీసుకుంటూ వచ్చిన కిరణ్ అబ్బవరం.. రాజావారు రాణివారు అనే సినిమాతో హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆ సినిమా బాగానే హిట్ అయింది. ఆ తరువాత కిరణ్ అబ్బవరం ఎస్ ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే, సెబాస్టియన్ అనే కొన్ని సినిమాలు చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందులో ఎస్ఆర్ కళ్యాణమండపం పర్వాలేదనిపిస్తుంది. సమ్మతమే సినిమా కరోనా టైంలో వచ్చింది. తక్కువ ఆక్యుపెన్సీతోనే ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కానీ ఈ సినిమా మీద కూడా విపరీతమైన నెగటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అని అంతా అంటూ ఉంటారు. కలెక్షన్ల పరంగా ఈ సినిమా సూపర్ హిట్ అని మేకర్లు చెబుతుంటారు.


తాజాగా కిరణ్ అబ్బవరం తన మీద, తన సినిమాల మీద జరిగే ట్రోలింగ్‌పై రియాక్ట్ అయ్యాడు. వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో మీడియాతో ముచ్చటించింది చిత్రయూనిట్. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఎవరో ఊరు పేరు తెలియని వారంతా కూడా తన సినిమా గురించి ట్విట్టర్‌లో నెగెటివ్ స్ప్రెడ్ చేస్తారంటూ మండి పడ్డాడు.


సమ్మతమే సినిమాను కూడా ఫ్లాప్ అని అన్నారు.. ఆ సినిమాకు మూడు కోట్లు పెట్టాం.. అన్నీ కలిపి పన్నెండు కోట్లు వచ్చాయి.. అంత వచ్చినా కూడా ఫ్లాప్ అని అంటే ఎలా.. తెలియకుండా లెక్కల గురించి మాట్లాడొద్దు అని కిరణ్ అబ్బవరం అందరికీ క్లాస్ పీకాడు.


వినరో భాగ్యము విష్ణు కథ మంచి సినిమా అని, మంచి మాటలు చెప్పామని, దేశం గురించి చెప్పామని, పిల్లలకు ఎలాంటి మాటలు చెప్పాలో.. ఎలా పెంచాలో.. చూపించామని.. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని అందరూ చూడండి అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు.


Also Read:  Sonu Nigam Attack Video : స్టార్ సింగర్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. ఈవెంట్‌లో గొడవ.. వీడియో వైరల్


Also Read: G V krishna rao Death : ఇండస్ట్రీలో విషాదం.. క్లాసిక్ సినిమాలకు పని చేసిన సీనియర్ ఎడిటర్ కన్నుమూత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook