Kiran Abbavaram Marriage:మరికొన్ని గంటల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నయంగ్ కిరణ్ అబ్బవరం..
Kiran Abbavaram Marriage: తెలుగు సినీ ఇండస్డ్రీలో ఒక్కో యువ నటులు తమ బ్యాచిలర్ లైఫ్‌కు పులిస్టాప్ పెట్టేస్తున్నారు. అంతేకాదు పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోయిన్ రహస్య గోరఖ్ ను డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాడు
Kiran Abbavaram Marriage: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్‌ల నిశ్చితార్ధం ఈ యేడాది మార్చి 13న హైదరాబాద్ లోని
ఒక ప్రైవేట్ రిసార్ట్లో కొంత మంది బంధు మిత్రుల సమక్షంలో వీరిద్దరి ఉంగరాలు మార్చుకున్నారు. గత ఐదేళ్ల నుంచి వీళ్లిద్దరు డేటింగ్‌లో ఉన్నారు. ఒకరినొకరు అర్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లో ఆగష్టు 22 అర్ధరాత్రి వీళ్లిద్దరు వివాహాం కర్ణాటక రాష్ట్రంలోని కొడుగులో జరగనుంది. ఈ వివాహ వేడుకకు తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్, శాండిల్ వుడ్ కు చెందిన సినీ సెలబ్రిటీలందరూ హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఈ హీరో ‘క’ అనే..సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమా పై మరింత ఆసక్తి నెలకొల్పింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో దర్శకద్వయం సందీప్, సుజీత్..ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.
కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ లు తొలిసారి 'రాజా వారు రాణి గారు' సినిమాలో కలిసి నటించారు. ఫస్ట్ మూవీలోనే వీళ్లిద్దరు తొలి చూపులు చూసుకొని లవ్ లో పడిపోయారు. కిరణ్ అబ్బవరం, రహస్య గత కొన్నేళ్లుగా రహస్య ప్రేమ బంధంలో ఉన్నారు. అంతేకాదు వీళ్లిద్దరు రిలేషన్ షిప్‌లో ఉన్నారు. కిరణ్ అబ్బవరం.. తన లైఫ్ ను ఎపుడు ప్రైవేట్‌గా ఉంచుకోవడం ముందు నుంచి అలవాటు. అంతేకాదు తన పర్సనల్ విషయాలను ఎపుడు రహస్యంగా ఉంచుతూ వస్తున్నాడు. తాజాగా ఈమెతో ఎంగేజ్మెంట్ వరకు అంతా ఛడీ చప్పుడు కాకుండా సాగిపోయింది.
కిరణ్ అబ్బవరం విషయానికొస్తే.. 'రాజా వారు రాణి గారు' సినిమాతో కథానాయికుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ0 తర్వాత తన దర్శకత్వంలో తెరకెక్కిన 'SR కళ్యాణ మండపం' సినిమాతో ఫస్ట్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత స్టెబాస్టియన్ PC 524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్, రూల్స్ రంజన్ సినిమాలతో కిరణ్ అబ్బవరం తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. త్వరలో 'దిల్ రూబా' మూవీతో పాటు 1970 దశకం నేపథ్యంలో సాగే ‘క’ అనే పీరియాడిక్ మూవీలతో పలకరించబోతున్నాడు.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి