Klinkara: క్లీంకార క్యూట్ వీడియో.. ఫస్ట్ టైమ్ టీవీలో తండ్రిని చూసి అల్లరి చేసిన మెగా ప్రిన్సెస్..!
Klinkara Cute Video: రామ్ చరణ్ ఉపాసనల గారాలపట్టి తండ్రిని ఫస్ట్ టైం చూసి చేసిన అల్లరి మాములుగా లేదు.. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ మేకింగ్ వీడియోను టీవీలో చూసింది క్లింకారా అందులో తన తండ్రిని చూసి క్లీంకార అల్లరి చేసింది ఆ వీడియో మీరూ చూడండి.
Klinkara Cute Video: ఆర్‌ఆర్‌ఆర్ మేకింగ్ వీడియో టీవీలో చూసింది మెగా మనవరాలు.. టీవీలో తండ్రిని చూసి అల్లరి చేసింది. ఆ వీడియో చూసి చెయ్యి కూడా ఊపింది. ఈ వీడియోను ఉపాసన కొణిదెల ఎక్స్ వేదికగా షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్లీంకారా రెడ్ కలర్ డ్రెస్ ధరించింది. ఈ వీడియోలో కూడా క్లీంకార ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది ఉపాసన. ఇక ఈ వీడియోను షేర్ చేసి క్లీంకార మొదటిసారి టీవీలో తన నాన్నను చూసి ఎగ్జైట్ అయింది. నాకు ఎంత గర్వంగా ఉంది గేమ్ ఛేంజర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నా అని పోస్ట్ చేసింది. ఈ వీడియోపై నెట్టిజెన్లు క్లీంకార ఎంత క్యూట్‌గా ఉంది అని కామెంట్ పెడుతున్నారు.
మెగా ప్రిన్సెస్ ఈ కొత్త వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేయగా మెగా ఫ్యాన్స్ అంతా ఆనందిస్తున్నారు. క్లీంకార ఎంత క్యూట్‌గా ఉంది అని మురిసిపపోతున్నారు. ఇక వీడియోలో క్లీంకార తండ్రిని మొదటిసారిగా స్క్రీన్ పై చూసి సంతోషంగా కేకలు వేస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్ మేకింగ్ వీడియోను ఉపాసన ప్రదర్శించడంతో ఇలా ఆనందంతో అల్లరి చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ నెల 10న గేమ్ చేంజర్ మూవీ కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మరోసారి కియార అద్వానీ రామ్ చరణ్ తో జతకడుతోంది.
ఇదీ చదవండి: హెచ్‌ఎంపీవీ డేంజర్ బెల్స్.. తల్లిదండ్రులకు డబ్ల్యూఏఎఫ్ కీలక సూచనలు..!
2012లో రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి జరిగింది, వీరిది పేరు ప్రేమ వివాహం. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత క్లింకార 2023 జన్మించింది.. ఇప్పటికీ క్లింకారకు 19 నెలలు కానీ ఇప్పటివరకు మెగా ప్రిన్సెస్ ఫేస్ రివీల్ కాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంది ఉపాసన కొణిదెల. కొన్ని సందర్భాల్లో క్లింకార ఫోటోలు బయటకు వచ్చాయి కానీ ఫేస్ బ్లర్ చేస్తూ పోస్ట్ చేసింది ఉపాసన. ఈరోజు వీడియోలో కూడా బ్యాక్ సైడ్ నుంచి క్లీంకార వీడియో తీసింది దీంతో పూర్తిగా ముఖం కనిపించలేదు. ఇక క్లింకార మెగాస్టార్ రామ్ చరణ్ మనవరాలు ..
ఇక ఆర్‌ఆర్‌ఆర్ ( రౌద్రం, రణం, రుధిరం) అనే టైటిల్ తో 2022లో విడుదలై అనే రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత ఇందులో 'నాటు నాటు' సాంగ్ కి ఆస్కార్ అవార్డు కూడా దక్కించుకుంది. ఈ సినిమాని జక్కన్న డైరెక్ట్ చేయక డివివి దానయ్య ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ నటించారు. ఇక హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, శ్రేయాలు కూడా నటించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్ తో రూపొందించారు.
ఇదీ చదవండి: రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో జబర్దస్త్ బ్యూటీ.. అడ్డంగా బుక్కైన రీతూ చౌదరీ..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook