WAF Safety Tips On HMPV: చైనాలో కొత్త వైరస్ హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి, ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ (WAF) పిల్లలు కలిగిన తల్లిదండ్రులకు కీలక ఆరోగ్య సూచనలు చేసింది. పిల్లల ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఓ ప్రకటన జారీ చేసింది. హెచ్‌ఎంపీవీ ఇతర వైరస్‌ల బారి నుంచి బయటపడటానికి జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించింది.
మీ పిల్లల్లో ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది...
లక్షణాలు..
మీ పిల్లలో తరచూ జ్వరం, దగ్గు, జలుబు,ముక్కు కారడం, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఏవైనా ర్యాషెస్ కనిపిస్తే ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ లక్షణాలు కనిపిస్తే పిల్లలను స్కూలు, బయటకు పంపించకుండా ఇంట్లోనే ఉంచండి. వారం వరకు వారిని బయటకు ఎక్కడికీ పంపించకుండా ఇంట్లోనే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ లక్షణాలు మూడు వారాల కంటే ఎక్కువ రోజులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి.
నీరు..
పిల్లలకు నీరు తగిన మోతాదులో తాగేలా చూసుకోవాలి. ముఖ్యంగా నిమ్మరసం వంటివి ఇంట్లోనే తయారు చేసి ఇవ్వండి. వైరస్ లక్షణాలు కనిపిస్తే ఇలాంటి నేచురల్ డ్రింక్స్ తయారు చేసి ఇవ్వండి.
టెంపరేచర్..
పిల్లలకు ఎక్కువ చలి పెట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే వైరల్ లక్షణాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
సన్‌లైట్ థెరపీ..
పిల్లలకు సన్ లైట్ థెరపీ అందించాలి. అంటే వారంలో కనీసం ఒక్కసారి అయినా ఓ 40 నిమిషాల పాటు ఎండలో ఉండేలా చేయండి. ఉదయం 10 గంటలు లేదా సాయంత్రం 4 గంటల సమయంలో ఈ సన్ లైట్ థెరపీ చేయించాలి. అప్పుడే వారి శరీరలంలో విటమిన్ డీ బూస్ట్ అవుతుంది.
నాజల్ క్లీనింగ్..
నాజల్ వాషింగ్‌ను నాజల్ ఇరిగేషన్ అని కూడా పిలుస్తారు. దీని అర్థం సెలైన్ వాటర్ సొల్యూషన్‌తో ఒక ముక్కు రంధ్రం నుంచి వేసుకుని మరో ముక్కు రంధ్రం నుంచి బయటకు పంపించాలి. ఇలా చేయడం వల్ల మ్యూకస్ అలర్జీ రాకుండా ఉంటుంది. ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఇలా చేయాలి. దీంతో ముక్కు ద్వారా ఏవైనా వైరస్‌లు చేరితే శుభ్రం అయిపోతుంది.
ఇదీ చదవండి: రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో జబర్దస్త్ బ్యూటీ.. అడ్డంగా బుక్కైన రీతూ చౌదరీ..?
పుక్కిలించడం..
ఇది అందరూ ఆరోగ్య నిపుణులు ఇచ్చే కీలక సూచన. ఏవైనా రొంప, గొంతు సమస్యలు వస్తే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి గొంతు గార్గిల్ చేయాలి. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే పంటి ఆరోగ్యానికి కూడా మేలు చేసినట్టవుతుంది.
సప్లిమెంట్స్..
మీ పిల్లల ఇమ్యూనిటీ స్థాయిలు పెంచే సప్లిమెంట్ అందించండి. దీంతో వైరస్‌ల బారినుంచి త్వరగా బయటపడతారు. వారికి విటమిన్ డీ, సీ, విటమిన్ బీ12, బీ కాంప్లెక్స్ ఇవ్వండి.
ఆహార జాగ్రత్తలు..
వైరస్‌ల విజృంభణ నేపథ్యంలో పిల్లలకు బయట ఆహారం పూర్తిగా తగ్గించేయండి. ముఖ్యంగా బర్గర్, పీజ్జా, పానీపూరి, కేకులు, ఎక్కువ చక్కెర ఉండే ఆహారాల నుంచి వారిని పూర్తిగా దూరంగ ఉంచండి. ఈ ఆహారాలతో పేగు ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాదు ఇమ్యూనిటీ మందగించేలా చేస్తాయి.
ఇదీ చదవండి: నువ్వే పెద్ద దరిద్రం అని పారుపై విరుచుకుపడ్డ కార్తీక్.. దీపను చూడటానికి బయలుదేరిన సుమిత్రమ్మ..
(నోట్: యాంటీబయోటిక్స్ వైరల్ ఇన్ఫెక్షన్ల బారి నుంచి పూర్తిగా బయటపడేలా చేయవు. ఇవి కడుపు, ఇమ్యూనిటీ డ్యామేజ్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి సొంతగా చికిత్స చేయకుండా వైద్యుల సూచనలు పాటించండి)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి