Miss Universe 2021 Harnaaz Kaur Sandhu: ఇజ్రాయెల్ వేదికగా జరిగిన మిస్​ యూనివర్స్​-2021 పోటీల్లో భారత యువతి హర్నాజ్ సంధూ (Harnaaz Sandhu Win Miss Universe title) కిరీటాన్ని దక్కించుకుంది. దీనితో భారత్​కు.. 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1994లో సుస్మితా సేన్​, ఆ తర్వాత 2000 సంవత్సరంలో లారా దత్త చివరిసారిగా మిస్​ యనివర్స్ కిరాటాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు హర్నాజ్ సంధూ.. మిస్​ యూనివర్స్​గా (Miss Universe title to India) నిలిచింది.


ఇంతకి ఎవరు ఈ హర్నాజ్ సంధూ? అమె నేపథ్యం ఏమిటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


హర్నాజ్​ సంధూ 2000 సంవత్సరంలో (Harnaaz Sandhu Birth year) చండీగఢ్​లో జన్మించింది. అమె పూర్తి పేరు హర్నాజ్ కౌర్ సంధూ. హర్నాజ్​ సంధూ తల్లి అమృత​ కౌర్​ సంధూ, తండ్రి గురుచరణ్​ సింగ్​ సంధూ.


మోడలింగ్​తో కెరీర్​ ప్రారంభం..


17 ఏళ్ల వయసులో మోడలింగ్​ కెరీర్​ ప్రారంభించింది. అదే ఏడాది మిస్ చంఢీగడ్ టైటిల్​ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2018లో మిస్​ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా-2018 టైటిల్​ను అందుకుంది. 2019లో మిస్​ ఇండియా పంజాబ్​ టైటిల్​ను సొంతం చేసుకుంది. ఈ ఏడాదే బాలీవుడ్ నటి కృతి సనన్​ చేతుల మీదుగా మిస్​ దివా యూనివర్స్ ఇండియా కిరిటాన్ని ధరించింది హర్నాజ్ సంధూ.


ఇక తాజాగా 70వ మిస్​ యూనివర్స్ కిరీటాన్ని (Miss Universe 2021) అందుకుని అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటింది.



Also read: Allu Arjun: అల్లు అర్జున్‌ను సర్ ప్రైజ్ చేసిన స్టార్ హీరోయిన్..ఏం గిఫ్ట్ పంపిందో తెలుసా..


Also read: Pushpa: 26 సెకన్లలో 'పుష్ప' స్టోరీ చెప్పేసిన ట్రైలర్ టీజ్.. డిఫరెంట్ మ్యానేరిజంతో ఐకాన్ స్టార్ అదుర్స్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook