Kollywood Actor Shivaji Passed Away: కోలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ న‌టుడు ఆర్ఎస్ శివాజీ (66) క‌న్నుమూశారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శివాజీ వందకుపైగా సినిమాల్లో నటించారు. క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా న‌టించిన చాలా సినిమాల్లో ఇతడు కీ రోల్స్ చేశాడు. క‌మ‌ల్‌తో కలిసి విక్ర‌మ్‌, స‌త్య‌, అపూర్వ స‌గోద‌ర‌గ‌ళ్‌, మైఖేల్ మ‌ద‌న కామ‌రాజు, గుణ‌, చాచి 420, భామనే సత్యభామనే, సత్యమేశివం వంటి పలు సినిమాల్లో ఇతడు నటించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇతడు తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించాడు. మెగాస్టార్ చిరంజీవి-శ్రీదేవి కాంబోలో వచ్చిన 'జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆర్ఎస్ శివాజీ. ఇతడు మాలోకం అనే కానిస్టేబుల్ పాత్ర‌లో నటించి మెప్పించాడు. శివాజీ.. తేజ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన '100 అబ‌ద్దాలు' సినిమాలో నటించాడు. గ‌త ఏడాది సాయిప‌ల్ల‌వి టైటిల్ రోల్ చేసిన గార్గి సినిమాలో ఆమె తండ్రి పాత్ర‌లో శివాజీ నటనకు ప్రశంసలు దక్కాయి. టైమ్ ఎన్న బాస్ అనే వెబ్‌సిరీస్‌లో ఇతడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. సినిమాల‌తో పాటు కొన్ని టీవీ సీరియ‌ల్స్‌లో ఇతడు నటించాడు. 


Also Read: 'భగవంత్ కేసరి' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. మాస్ స్టెప్పులతో ఇరగదీసిన బాలయ్య, శ్రీలీల..


ఆర్ఎస్ శివాజీ సోద‌రుడు సంతాన భార‌తి త‌మిళంలో టాప్ డైరెక్టర్ ల్లో ఒక‌రిగా కొనసాగుతున్నారు. శివాజీ తండ్రి ఎం ఆర్ సంతానం కూడా కొన్ని సినిమాల్లో నటించారు.  శివాజీ మృతితో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. శివాజీ చివరిగా యోగిబాబు లీడ్ రోల్ లో నటించిన లక్కీ మ్యాన్‌లో నటించారు. ఇది శుక్రవారం (సెప్టెంబర్‌ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది రిలీజైన మరుసటి రోజే శివాజీ కన్నుమూయడం  యాదృఛ్చికం.



Also Read: Aparna P Nair: ప్రముఖ సీరియల్ నటి అనుమానాస్పద మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook