Vidaamuyarchi: సంక్రాంతి బరిలో అజిత్ ‘విడాముయర్చి’.. అంచనాలు పెంచేస్తోన్న టీజర్..
Vidaamuyarchi: కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విడాముయర్చి’. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Vidaamuyarchi Release Date :తమిళ అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఈయన లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో ‘విడాముయర్చి’ అనే చిత్రం చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతికతతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు.
తమిళంలో ఓకే కానీ.. తెలుగులో ఇప్పటకే జనవరి 10న రామ్ చరణ్.. ’గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా విడుదలైన రెండు రోజులకు జనవరి 12న బాలయ్య నటిస్తోన్న ‘డాకూ మహరాజ్’ రాబోతుంది. ఆ తర్వాత జనవరి 14న వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
మరి అజిత్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించినా.. విడుదల తేది అనౌన్స్ చేయలేదు. బహుశా జనవరి 9, 11, 13 తేదిల్లో తెలుగు సినిమాలకు పోటీ లేకుండా రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కంప్లీజ్ చేసుకుంటోంది.
తాజాగా ‘విడాముయర్చి’ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే సినిమాలో హీరో అజిత్ కుమార్ డిఫరెంట్ అవతార్‌లో కనిపిస్తోంది. మొత్తంగా ప్యాన్ ఇండియా అప్పీల్ కోసం ఒక్క డైలాగ్ లేకుండా.. కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ టీజర్ ను కట్ చేయడం విశేషం. ప్రపంచమంతా నిన్ను నమ్మకపోయినా పరావాలేదు.. నిన్ను నువ్వు నమ్ముకో.. అనే కాన్సెప్ట్‌తో సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమాగా రాబోతున్నట్టు ఈ టీజర్ చూస్తూ తెలుస్తోంది. అజిత్ దేని కోసమో అన్వేషిస్తున్నారు.. చివరకు తనకు కావాల్సిన దాని కోసం విలన్స్ భరతం పడుతున్నారు. తాను సాధించాల్సిన లక్ష్యం కోసం ఏం చేయటానికైనా, ఎంత దూరం వెళ్లే టైపు. ఎవరినైనా ఎదిరించేలా ఇప్పటి వరకు కనిపించని ఓ వైవిధ్యమైన క్యారెక్టర్ లో అజిత్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నాయి.
భారతీయ సినీ ఇండస్ట్రీలో స్టార్స్‌తో భారీ బడ్జెట్ చిత్రాలు, డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాలను నిర్మిస్తోన్న భారీ చిత్ర నిర్మాణ సంస్థ టాప్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించిన మగిళ్ తిరుమేని అజిత్‌తో ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించాడు.
అజిత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్, యాక్షన్ కింగ్ అర్జున్, త్రిష ఈ ముగ్గురు కలిసి ఈ సినిమాలో నటించడం విశేషం. ఇప్పుడు మరోసారి వీరి త్రయం ఆడియెన్స్‌ను మెప్పించనున్నారు. అలాగే విడాముయర్చిలో ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు ఇతర లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసారు. వారి పాత్రలను కూడా టీజర్‌లో రివీల్ చేశారు. అలాగే సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించడం విశేషం.
కోలీవుడ్ మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఓం ప్రకాష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఎన్.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మిలాన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఇంకా ఈ చిత్రానికి సుందర్ స్టంట్స్‌ను కంపోజ్ చేసారు. అను వర్ధన్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పని చేశారు. సుబ్రమణియన్ నారాయణన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. జె.గిరినాథన్, కె.జయశీలన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌గా వర్క్ చేస్తున్నారు. అజిత్ హీరోగా నటిస్తోన్న ‘విడాముయర్చి’ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter