Simbu Donation for Floods: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల తో పాటూ చుట్టుపక్కల ప్రాంతాలలో వరద ఉధృతి అక్కడి ప్రాంతాలను నీటిమయం చేసింది. ఇదే పరిస్థితి ఇటు తెలంగాణ ఖమ్మం జిల్లాలో కూడా ఏర్పడింది. తినడానికి తిండి లేక కనీసం నిలబడడానికి కాస్త చోటు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీగా వచ్చిన వరదల కారణంగా, ఆ ప్రాంతాలు నీటిమయం కావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అందులో భాగంగానే వారికి తినడానికి తిండి, నిత్యవసర అవసరాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, పలు వ్యాపారవేత్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా తమవంతు విరాళాలు ప్రకటిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. 


అయితే ఇప్పుడు తాజాగా తమిళ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో తొలిసారి తెలుగు ప్రజల కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతు సహాయంగా విరాళం ప్రకటించి, తెలుగు రాష్ట్రాలకు సహాయం చేసిన తొలి నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు కోలీవుడ్ స్టార్ హీరో. ఆయన ఎవరో కాదు శింబు.


రెండు రాష్ట్రాల ప్రజలకు  తన వంతు సహాయంగా 6 లక్షల రూపాయలను ప్రకటించి మంచి మనసు చాటుకున్నారు శింబు. నిజానికి ఇప్పటివరకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలు మాత్రమే స్పందించి రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళంగా కోట్ల రూపాయలను ఇచ్చారు. 


తెలుగు ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పక్క రాష్ట్రాలకు చెందిన సెలబ్రిటీలు ఎవరు కూడా స్పందించలేదు.. కానీ తొలిసారి తమిళ నటుడు అయిన శింబు స్పందించి ఆరు లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఏది ఏమైనా ఈయన గొప్ప మనసుకి అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. తెలుగు ప్రజలు సైతం ఈయన మంచి మనసుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. 


 



Also Read: Actor Vinayakan: వినాయక చవితి రోజే 'జైలర్‌' నటుడు వినాయకన్‌ అరెస్ట్‌..


Also Read: AP Floods Damage: ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని దెబ్బ.. వరదలతో రూ.6,880 కోట్ల నష్టం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.