Kondapolam making video: ఉప్పెన సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొట్టమొదటి సినిమాతోనే అదుర్స్ అనిపించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు కొండ పొలం అనే సినిమాతో మరోసారి ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. అక్టోబర్ 8న వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లోకి రానున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ (Vaishnav Tej, Rakul preet Singh) ఓబులమ్మ అనే యువతి పాత్రలో జంటగా నటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి (Sunnapureddy Venkatarami Reddy) రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను ఫేమస్ డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేయగా.. రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా నిర్మించారు. కొండకోనల్లో, దట్టమైన అడవుల్లో గొర్రెలు మేపుకుని బతుకుబండి లాక్కుని వచ్చే గిరిజనులు ఎదుర్కొనే సవాళ్లే ఈ సినిమా ప్రధాన కథాంశం. అడవిలో కృూరమృగాలు, కృూరమృగాళ్లాంటి మనుషుల నుంచి ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించారనేది తెలియాలంటే కొండ పొలం వీక్షించాల్సిందే. 



Also read : Allu Arjun on F3 sets: ఎఫ్‌3 సెట్‌లో అల్లు అర్జున్‌.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో కలిసి ఫుల్‌ జోష్‌గా గడిపిన బన్నీ


కొండ పొలం మూవీ షూటింగ్ వికారాబాద్ ఫారెస్ట్‌లోనే ఎక్కువ శాతం చిత్రీకరించారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో మేకర్స్ విడుదల చేసిన కొండ పొలం మేకింగ్ వీడియో (Kondapolam making video) ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఇటీవల విడుదలైన కొండ పొలం మూవీ ట్రైలర్ సైతం (Kondapolam trailer) ఆసక్తినిరేకెత్తించేలా కట్ చేశారు.


Also read : Samantha, Naga Chaitanya divorce: నాగచైతన్య, సమంత విడాకులను ఉద్దేశించే వెంకటేష్ ఆ పోస్ట్ పెట్టాడా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook