Kondapolam Trailer: "మీ ఎనకాల గొర్రెలు కాదు కాదా.. వాటి బొచ్చుకుడా రాదు"

ఉప్పెన ఫేం మెగా హీరో వైష్ణవ తేజ్ రకుల్ ప్రీత్ నటించిన "కొండపొలం" ట్రైలర్ విడుదలయింది. మీరే ఓ  లుక్కేయండి   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2021, 05:16 PM IST
  • వైష్ణవ తేజ్ నటించిన 'కొండపొలం' ట్రైలర్ విడుదల
  • ఆకట్టుకుట్టునున్న వైష్ణవ్ తేజ్- రకుల్ జోడి
  • అదిరిపోయిన కీరవాణి నేపథ్య సంగీతం
  • నల్లమల అడవి నేపథ్యంలో కొనసాగిన సినిమా
Kondapolam Trailer: "మీ ఎనకాల గొర్రెలు కాదు కాదా.. వాటి బొచ్చుకుడా రాదు"

Kondapolam Trailer: ఉప్పెన సినిమాతో హిట్ కొట్టిన ఉప్పెన వైష్ణవ్‌ తేజ్‌, రకుల్ ప్రీత్‌సింగ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘కొండపొలం’ సినిమా ట్రైలర్ విడుదలైంది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రాజీవ్‌ రెడ్డి, జె. సాయి బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎం. ఎం. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకోగా... సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలతో సినిమా ట్రైలర్ ఆసక్తిగా ఉంది. వైష్ణవ్‌ తేజ్‌ రవీంద్ర యాదవ్‌గా, ఓబులమ్మగా రకుల్‌ నటిస్తున్న ఈ సినిమాలో గొర్రెల కాపరిగా హీరో హీరోయిన్లు నటిస్తున్నారు. మొదట ఉన్నత విద్య అభ్యసించిన వ్యక్తిగా వైష్ణవ్‌ తేజ్‌ తో ప్రారంభమైన ట్రైలర్ ఏ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకున్నారు?’ అంటూ ఇంటర్వ్యూ చేసే వారు అడగ్గా ‘అడవి సర్‌. నల్లమల అడవి’ అని వైష్ణవ్‌ సమాధానం ఇవ్వటం... అన్ని చోట్ల హీరోకు నిరాశ ఎదురవ్వడం తరువాత గ్రామీణ ప్రాంతంలో.. ఇలా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. 

Also Read: Cannibal Couple: 30మందిని పైగా చంపి తిన్న నరమాంస దంపతులు... ఎక్కడంటే..??

సినిమా ట్రైలర్ లో గొర్రెలను పెంచటం, పులితో ఫైటింగ్ సీన్ లు ఉన్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ లో హీరో వైష్ణవ్  తేజ్ చెప్పే డైలాగులు, గ్రామీణ యాస, సీనియర్ నటుడు కోట శీనివాస్- హీరో మధ్య జరిగే సంభాషణ, హీరో-హీరోయిన్ల రొమాన్స్ చాలా ఆసక్తికకరంగా ఉన్నాయి.  అక్టోబర్ 8 వ తేదీన సినిమా విడుదల అవ్వనున్న విషయం మన అందరికీ తెలిసిందే...మీరే ఒకసారి ట్రైలర్ చూసి ఎలా ఉందో చెప్పండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

pple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News