Konidela Productions Company is getting trolled hardly for not Releasing Thaar Maar Thakkar Maar song lyrical video: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ పేరుతో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మోహన్ లాల్ నటించిన పాత్రలో నటిస్తుండగా వివేక్ ఓబెరాయ్ నటించిన పాత్రలో సత్యదేవ్, మంజు వారియర్ నటించిన పాత్రలో నయనతార నటిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే జాన్ నటించిన పాత్రలో సముద్రఖని నటిస్తుండగా మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద ఆర్బీ చౌదరి, ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి డాన్స్ చేసిన ఒక మాస్ నెంబర్ ను సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం, 7 గంటల సమయంలో విడుదల చేస్తామని సినిమా యూనిట్ ప్రకటించింది.


అయితే ముందు రోజు ఎలా అయితే ప్రోమో లేటుగా విడుదల చేసిందో పాట కూడా అలాగే లేటుగా విడుదల చేస్తారని భావించారు. కానీ సుమారు రెండు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆ పాట విడుదల చేయలేదు. పాట విడుదల చేయకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా పాట విడుదల చేయడంలో ఆలస్యం అయిందని పేర్కొంటూ సినిమా యూనిట్ అధికారికంగా ఒక ప్రకటన జారీ చేసింది. త్వరలోనే ఆ పాట రిలీజ్ డేట్, టైం ప్రకటిస్తామని కూడా ప్రకటనలో పేర్కొన్నారు.


అయితే రెండు రోజుల పాటు ఒక పెద్ద హీరో సినిమా నుంచి ప్రకటించిన టైం దాటి ఒక లిరికల్ సాంగ్ కూడా విడుదల చేయకుండా ఉండడం మీద పెద్ద ఎత్తున విమర్శలు వర్షం కురుస్తోంది. మెగా అభిమానులు అయితే రామ్ చరణ్ తేజకు సినీ నిర్మాణం మీద దృష్టి పెట్టేంత సమయం లేకపోతే ఇలా వేరే వాళ్ళకి పనులు అప్పగించి దయచేసి సినిమా మీద ఆసక్తి సన్నగిల్లే విధంగా చేయవద్దని కోరుతున్నారు. అసలే లూసిఫర్ సినిమా తెలుగు వెర్షన్ కూడా తెలుగు ప్రేక్షకులు దాదాపు చూసేశారు.


అందుకే గాడ్ ఫాదర్ సినిమా మీద పెద్దగా బజ్ లేదు. అలాంటి సమయంలో బజ్ క్రియేట్ చేయాల్సింది పోయి చెబుతామన్న టైంకి కూడా సాంగ్ రిలీజ్ చేయకపోవడం అనేది ఫ్యాన్స్ ని హార్ట్ చేయడమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరు సినిమా వాయిదా పడే అవకాశం ఉందని కామెంట్ చేస్తున్నారు. అక్టోబర్ 5న రిలీజ్ చేసే సినిమాకు లిరికల్ వీడియో రిలీజ్ చేయలేని స్థితిలో ఉన్నారంటే సినిమా విడుదల అసాధ్యం అని అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆచార్య రిజల్ట్ మళ్లీ రిపీట్ కావడం తథ్యమని మెగా అభిమానులే కామెంట్ చేయడం గమనార్హం. చూడాలి మరి ఫాన్స్ సూచనలను సినిమా యూనిట్ ఏమేరకు తీసుకుంటుంది అనేది. 


Also Read: Ramya Pandian Hot Photos: వామ్మో హద్దులు దాటేసిన రమ్యా పాండియన్.. నెవర్ బిఫోర్ అందాల విందు!


Also Read: Nagarjuna Shock: పేరుపేరునా కంటెస్టంట్లను కడిగిపారేసిన నాగార్జున.. ఎలిమినేషన్ షాక్ కూడా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి