Kota Srinivasa Rao Comments On Anasuya Dressing: బుల్లితెర యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj)..వెండితెరపై నటిగానూ రాణిస్తోంది. తనదైన యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. గ్లామర్‌ విషయంలో హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది. సోషల్‌ మీడియాలోనూ హాట్‌ ఫోటో షూట్‌లతో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆమె  డ్రెస్సింగ్‌పై మాత్రం ఓ వర్గం ప్రేక్షకుల నుంచి నేటికీ విమర్శలు వస్తూనే ఉంటాయి. ఇద్దరు పిల్లల తల్లి అయ్యి ఉండి ఆ బట్టలేంటి అంటూ కొందరు నెటిజన్ల నుంచి ట్రోల్స్‌ను ఇ‍ప్పటికీ ఎదుర్కుంటున్నారు. తాజాగా అనసూయ డ్రెస్సింగ్‌ స్టైల్‌పై సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) వివాదాస్పద కామెంట్స్‌ చేశారు. అనసూయ(Anasuya Bharadwaj) మంచి డ్యాన్సరే కాక మంచి నటి అని, అయితే ఆమె వేసుకునే బట్టలు మాత్రం తనకు నచ్చవని కామెంట్‌ చేశారు.


Also read: Surekha Vani Second Marriage: నటి సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకుందా? వైరలైన ఫోటోస్


ఇటీవలె ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అనసూయ లాంటి అందమైన అమ్మాయి ఎలా ఉన్నా జనాలు చూస్తారు. అలాంటి బట్టలు వేసుకోవాల్సిన పనిలేదు. ఆమె చక్కటి నటి. కానీ ఆమె డ్రెస్సింగ్‌ నాకు నచ్చదు. ఆమె మీద గౌరవం ఉంది కాబట్టే డ్రెస్సింగ్‌ మారిస్తే బావుంటుందని అంటున్నాను అని పేర్కొన్నారు. ప్రస్తుతం కోట(Kota Srinivasa Rao) చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి