Hari Hara Veera Mallu: పెద్ద హీరోలతో సినిమా అంటే ఏ డైరెక్టర్ అయినా రెడీగా ఉంటాడు. ఎందుకంటే హిట్ అయ్యే ఆస్కారం ఈ చిత్రాలకు ఎక్కువగా ఉంటుంది. అగ్ర హీరోలకు మార్కెట్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిస్క్ తక్కువ అని డైరెక్టర్స్ భావిస్తారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో మూవీ అంటే డైరెక్టర్స్ ఎక్సైటింగా ఫీల్ అవుతారు. కరెక్ట్ బ్లాక్ బస్టర్ పడిందా ఇక డైరెక్టర్ దశ తిరిగినట్టే లెక్క. పాపం హరిహర వీరమల్లు ఆఫర్ కు ఓకే చెప్పినప్పుడు క్రిష్ కూడా ఇదే రకమైన ఫీలింగ్ అనుభూతి చెంది ఉంటాడు. కానీ అనుకున్నది ఒక్కటి జరిగింది మరొకటి అన్నట్టు మారింది ఈ మూవీ పరిస్థితి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకు ఇండస్ట్రీలో రాజమౌళి సినిమా ఒక్కటే సంవత్సరాలు పట్టేది.. అయితే ఆ రికార్డును బద్దలు కొట్టడానికి అన్నట్లు పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ ను డ్రాగ్ చేస్తూనే ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ లో జరిగినంత జాప్యం ఇంకా ఏ చిత్రానికి జరిగి ఉండకపోవచ్చు. మూవీ కోసం వేసిన భారీ సెట్లు కూలిపోవడం.. జనసేన నాయకుడిగా పవన్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో బిజీ కావడం.. ఇలా ఈ సినిమాకి ఎన్నో ఆటంకాలు. పోనీ పొలిటికల్ గ్యాప్ ఇచ్చిన సమయంలో అయినా వీరమల్లు షూటింగ్ కి వస్తాడా అనుకుంటే మధ్యలో బ్రో చిత్రం ఒకటి అడ్డం పడింది.


ఇక చేసేది లేక ఆ కాస్త గ్యాప్ లో వైష్ణవ తేజాతో కొండపాలెం మూవీని తీశాడు క్రిష్. అతని లైఫ్ లో ఊహించనంత డిజాస్టర్ గా ఆ చిత్రం మిగిలిపోయింది. విచిత్రం ఏమిటంటే ఈ మూవీకి డైరెక్టర్ క్రిష్ అన్న విషయం చాలామందికి అసలు తెలియని కూడా తెలియదు. ఇక ఆ తరువాత టైం వేస్ట్ చేయడం ఎందుకు అని తన దృష్టిని కాస్త వెబ్ సిరీస్ ల వైపు తిప్పి ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఒక నవల ఆధారంగా 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ ను తన ఆధ్వర్యంలో వేరే దర్శకుడి చేత తెరకెక్కించారు. నందమూరి తారకరత్న నటించిన మొదటి, చివరి వెబ్ సిరీస్ ఇదే. ఆ తర్వాత అంజలి ,అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో మరొక వెబ్ సిరీస్ ని పూర్తి చేశాడు.


మొత్తానికి టైం పాస్ అయితే ఈ దర్శకుడు చేశారు కానీ డైరెక్షన్ లో ఉన్న కిక్ నిర్మాణంలో ఉండదు కదా. అందుకే ఇక పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఆలోచించడం కొద్ది రోజులు మాని ప్రస్తుతం ఒక మంచి లేడీ ఓరియంటెడ్ స్టోరీని రెడీ చేసుకుని హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టాడట క్రిష్. కానీ ఇక్కడ కూడా ఈ దర్శకుడికి సమస్యలు ఎదురవుతున్నాయి.


ఎందుకనగా క్రిష్ అనుకున్న దాని ప్రకారం ఈ మూవీకి ఫస్ట్ ఆప్షన్ మన జేజమ్మ అనుష్క అయితే.. సెకండ్ ఆప్షన్ లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రస్తుతం మన స్వీటీ మెగా 156 మూవీ విశ్వంభర చేయాలా.. వద్దా తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఉంది. ఈ మూమెంట్ లో ఆమె క్రిష్ చెప్పే స్టోరీ కి ఓకే చెప్పడం కాస్త కష్టమే. మరి నయనతార రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ.. పోని అంత ఖర్చు పెట్టి సినిమా తీయాలి అనుకున్న తమిళ్ లో నయనతార కి ఉన్న క్రేజ్ టాలీవుడ్ లో లేదు. అలాంటప్పుడు అంత భారీ బడ్జెట్ చిత్రం చాలా రిస్కీ గా మారుతుంది. దీంతో ఈ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా గురించి కూడా అయోమయంలో ఉన్నారు దర్శకుడు.


మరోపక్క వీరమల్లు పూర్తి కావడానికి ఇంకో ఏడాది సమయం సులభంగా పట్టేలా ఉంది. మరి ఈ నేపథ్యంలో క్రిష్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి 


Also Read: Oppo Reno 11 Series: శక్తివంతమైన 50MP కెమెరాతో మార్కెట్‌లోకి Oppo Reno 11, Reno 11 Pro మొబైల్స్‌..విడుదల తేది అప్పుడే..


Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి