Oppo Reno 11 Series Launch Date In India: చైనీస్ టెక్ కంపెనీ Oppo గత ఏడాది నవంబర్‌లో రెనో లైనప్‌లో స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే భారత మార్కెట్‌లో రెనో లైనప్‌లో మరో సిరీస్ విడుదల కాబోతోంది. సరికొత్త లైనప్‌లో ఒప్పో రెనో 11, రెనో 11 ప్రో స్మార్ట్ ఫోన్స్‌ను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్స్ మిండ్ రేంజ్‌లో లాంచ్ కాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఒప్పో ఈ మొబైల్స్ సంబంధించిన విడుదల తేదిని కూడా ప్రకటించింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ స్మార్ట్ ఫోన్స్‌ను కంపెనీ ఒప్పో రెనో 11, రెనో 11 ప్రో జనవరి 11న మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన ల్యాండింగ్ పేజీ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, Oppo ఇండియా వెబ్‌సైట్‌లో లైవ్ అవుతోంది. ఈ Oppo రెనో-సిరీస్ శక్తివంతమైన కెమెరా అప్‌గ్రేడ్‌లు, స్టైలిష్ డిజైన్‌తో రాబోతోందని సమాచారం. రెనో 11 ప్రో మోడల్‌తో DSLR కెమెరాలతో పోటీ పడే శక్తివంతమైన కెమెరాను అందిస్తోంది. ఇవే కాకుండా అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
Reno 11 Pro కెమెరా ఫీచర్:
రెనో 11 ప్రో బ్యాక్ ప్యానెల్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50MP ప్రధాన కెమెరాతో మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ కెమెరా సెటప్‌లో 122 డిగ్రీల అల్ట్రా-వైడ్ కెమెరా, 2X ఆప్టికల్ జూమ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు మూడవ 32MP Sony IMX709 టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆటోఫోకస్‌తో 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ఒప్పో రెనో 11 మోడల్ కూడా ఫ్రాంట్‌లో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. దీంతో పాటు 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. Reno 11 Pro మొబైల్‌లో 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14పై పని చేస్తుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter