Krish New Look after hair Transplantation: కొండ పొలం అనే ప్రయోగాత్మక చిత్రం చేసిన తర్వాత క్రిష్ జాగర్లమూడి పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. హరిహర వీరమల్లు అనే సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు క్రిష్ కెరీర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ సినిమా. ఏఎం రత్నం నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతానికి షూటింగ్ దశలో ఉంది. అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు క్రిష్ కొత్త లుక్ హాట్ టాపిక్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో క్రిష్ అనేక మంచి సినిమాలుకు దర్శకుడిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన ఎక్కువగా బట్టతలతో కనిపిస్తూ ఉండేవారు. కానీ తాజాగా బయటకు వచ్చిన కొన్ని ఫోటోలలో మాత్రం ఆయన జుట్టుతో కనిపిస్తున్నారు. మొత్తం మీద ఆయన లుక్కు మొత్తం చేంజ్ చేశారనే వాదన వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకి సంబంధించిన బాస్ పార్టీ అనే సాంగ్ రిలీజ్ కాబోతోంది.


వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్ ఇప్పుడు నుంచి రిలీజ్ చేస్తున్నారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు షూటింగ్ వాల్తేరు వీరయ్య షూటింగ్ ఒకే ప్రాంతంలో జరుగుతూ ఉండడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ కలుసుకున్నారు. ఆ సమయంలో వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ అలాగే నిర్మాత ఏఏం రత్నం కూడా అక్కడే ఉన్నారు.


ఈ సందర్భంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ కి చిరంజీవి సాంగ్ వినిపించారు .పవన్ కళ్యాణ్ సాంగ్ బాగుందని అభినందనలు కురిపించారు. అయితే ఈ ఫోటోలలో క్రిష్ కూడా కనిపిస్తూ ఉండగా ఆయన తల మీద జుట్టు కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు బట్టతల మీద జుట్టు వచ్చిందే అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అలాగే జుట్టు వచ్చిన తర్వాత క్రిష్ కాస్త చురుగ్గా కనిపిస్తున్నారని ఆయనే హీరోలా అనిపిస్తున్నారని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇటీవలే దర్శకుడు కొరటాల శివ కూడా ఇలాగే హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుని బట్టలతో ఉండే తన తలను పూర్తిగా జుట్టు వచ్చేలా చేసుకున్నారు/ ఇప్పుడు క్రిష్ కూడా అదే బాటలో ముందుకు వెళ్లారన్న మాట. మొత్తం మీద తెలుగు దర్శకులందరూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Krishna Family: కృష్ణ-విజయనిర్మల ఆస్తుల పంపకాల్లో వివాదం.. అసలు నిజం బయటపెట్టిన నిర్మాత!


Also Read: Mega Family - Uday Kiran: మెగా ఫ్యామిలీ- ఉదయ్ కిరణ్ కు గొడవ పెట్టిన పత్రికాధినేత.. పవన్ కళ్యాణ్ మ్యాన్ హ్యాండ్లింగ్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook