Hari Hara Veera Mallu: పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఆ రూమర్ కి సైతం చెక్.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఈరోజు రెండు శుభవార్తలతో తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రిలీజ్ అయ్యి అందరినీ ఆకట్టుకుంటూ ఉండగా మరోపక్క ఈ హీరో హరిహర వీరమల్లు గురించి కూడా అప్డేట్ వచ్చేసింది.
Hari Hara Veera Mallu Update:
గత కొద్ది గంటల కిందే ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ విడుదలై పవన్ కళ్యాణ్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోంద ఈ చిత్రం మరుగున పడిపోయిందని గత కొద్దికాలంగా వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఆ వార్తలకు శుభం కార్డు వేస్టు ఈరోజు సినిమా యూనిట్ పవర్ ఫుల్ టీజర్ విరుదల చేసి అభిమానులను ఫుల్ ఖుషి చేశారు. ఈ ఆనందంలో ఉండగానే పవన్ అభిమానులకు మరో శుభవార్త కూడా వినిపించింది.
ఇంతకీ అదేమిటి అంటే.. పవన్ కళ్యాణ్ మరో సినిమా గురించి కూడా అప్డేట్ రావడం. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ షూటింగ్లోనే ఉంది. కానీ ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయిందని.. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని వదిలేసారని వార్తలు జోరుగా రాసాగాయి. అయితే అదంతా నిజం కాదని ఈరోజు చిత్ర యూనిట్ ప్రకటించడమే కాకుండా ఈ సినిమా ఓటిటి డీటెయిల్స్ ని కూడా బయటపెట్టారు
తాజాగా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఒక ఈవెంట్ నిర్వహించడమే కాకుండా ఈ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రాబోయే సినిమా వివరాలను కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమా యూనిట్ ఈవెంట్ కి అటెండ్ అయ్యి ఈ చిత్రం గురించి ఫుల్ గా క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది అని సూపర్ అప్డేట్ కూడా ఇచ్చేశారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రైమ్ వీడియో అఫీషియల్ గా వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఈవెంట్ కి క్రిష్ కూడా హాజరు కావడంతో.. క్రిష్ ఈ సినిమాలో భాగమే అని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
బాబీ డియోల్, నిధి అగర్వాల్, నోరా ఫతేహి ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Also Read: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook