విడుదలైన `కృష్ణ గాడు అంటే ఒక రేంజ్` మూవీ.. తన రేంజ్ చూపించాడా..?
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా.. రాజేష్ దొండపాటి దర్శకత్వం వహించిన సినిమా ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా రఘురామ్ మూర్తి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. సినిమా ఎలా ఉందంటే..?
Krishna Gadu Ante Oka Range Movie Review: శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా రఘురామ్ మూర్తి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి రాజేష్ దొండపాటి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కథ, కథనాలు ఏంటో ఓ సారి చూద్దాం.
కథ
కృష్ణ (రిష్వి తిమ్మరాజు) చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. తండ్రి ప్రారంభించిన ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోతుంది. తల్లి పెంపకంలో కృష్ణ పెరిగి పెద్దవాడు అవుతాడు. మామ సాయంతో ఊర్లో మేకలు కాస్తూ ఉంటాడు. అదే ఊర్లో దగ్గరి బంధువు సత్య (విస్మయ)ని చూసి ఇష్టపడతాడు. సత్య సైతం కృష్ణ మంచిమనసు, అమాయకత్వాన్ని చూసి ఇష్టపడుతుంది. అదే ఊర్లో ఓ తిరుగుబోతు, కామాంధుడు దేవా చూపు సత్య మీద పడుతుంది. ఆ తరువాత దేవా వల్ల కృష్ణ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? సొంతిళ్లు కట్టాలన్న తండ్రి కల నేరవేర్చాడా? చివరకు ఊరి జనంతో కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ అని ఎలా అనిపించుకున్నాడు? అన్నది కథ.
నటీనటులు
కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ సినిమా అంతా కృష్ణ, సత్యల చుట్టు తిరుగుతుంది. కృష్ణ పాత్రలో కొత్త కుర్రాడు రిష్వి చక్కగా నటించాడు. ఎమోషన్స్ పండించడంలోనూ, యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఓకే అనిపిస్తాడు. అక్కడక్కడా అనుభవ రాహిత్యం కనిపించినా మెప్పిస్తూ వస్తాడు. సత్యగా విస్మయ అదరగొట్టేసింది. చలాకీ పిల్లలా, వాగుడు కాయలా చక్కగా నటించింది. లుక్స్ పరంగానూ ఓకే అనిపిస్తుంది. ఇక పార్వతమ్మ, మల్లయ్యన్న, దేవా పాత్రలు ఎక్కువగా గుర్తుంటాయి. మిగిలిన పాత్రలు అక్కడక్కడా నవ్విస్తూ టైం పాస్ చేయిస్తాయి.
Also Read: IND Vs WI Dream11 Tips: విండీస్‌తో నేడు తొలి టీ20.. డ్రీమ్ 11 టిప్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇలా..
విశ్లేషణ
ఊర్లో ప్రేమ కథ, చిన్న చిన్న గొడవలు వాటి చుట్టూ అల్లుకుంటూ ఓ చిన్న క్రైమ్ స్టోరీ. ఇలా అన్ని జానర్లను కలిసి సింపుల్‌గా రాసుకున్నాడు దర్శకుడు రాజేష్. ఊరి వాతావరణాన్ని చక్కగా చూపిస్తూ సహజత్వంగా సినిమాను మలిచాడు. ఊర్లో తారసపడే పాత్రల్లానే అనిపిస్తాయి. ప్రథమార్దం అంతా కూడా సాఫీగా సాగుతుంటుంది. ప్రేమ సన్నివేశాలు, ఊర్లో అల్లరి చిల్లరగా తిరిగే పాత్రలతో కామెడీ పండించడం, విలనిజం చూపించేపాత్రలతో అలా అలా ఫస్ట్ హాఫ్‌ను చక్కగా తీసుకెళ్లాడు.
ద్వితీయార్థంలోనే మలుపులు, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. మర్డర్ జరగడం, దోపీడీలు జరగడం, వాటిని చేసింది ఎవరో కనిపెట్టడం ఇలా కృష్ణలోని పలు ఎమోషన్స్‌ను ద్వితీయార్థంలోనే ఎక్కువగా చూపించారు. క్లైమాక్స్‌తో హీరో నుంచి మంచి ఎమోషన్స్‌ను దర్శకుడు రాబట్టుకున్నాడు. సాంకేతికంగానూ ఈ సినిమా మెప్పిస్తుంది.
పాటలు వినసొంపుగా ఉంటాయి. ఆర్ఆర్ వల్ల ఎమోషన్స్ పండాయి. సాహిత్యం బాగుంది. పాటలు, మాటలు గుర్తుండిపోతాయి. కెమెరా వర్క్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎడిటర్ తన పని తాను చక్కగా నిర్వర్తించాడు. నిర్మాత ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించాడని అర్థం అవుతోంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
రేటింగ్: 2.7
Also Read: Janjatiya Vikas: జీ మీడియా ఆధ్వర్యంలో ఈ నెల 5న 'జనజాతీయ వికాస్'.. వేడుకల్లో భారీగా పాల్గొనండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook