Tribal Heritage of India in New Delhi: జీ మీడియా ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన న్యూ ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద ఇండియా ట్రైబల్ హెరిటేజ్ వేడుకలు జరగనున్నాయి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద 'జనజాతీయ వికాస్' కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆదివాసీ సాధికారత దిశగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తోంది. ఇది గిరిజన సంస్కృతి పరిరక్షణ, సమ్మిళిత అభివృద్ధి, జీవనోపాధి అవకాశాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, సున్నితత్వంపై ఉద్ఘాటిస్తుంది. జీ మీడియాకు మద్దతుగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 'జనజాతీయ వికాస్'ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది మొత్తం గిరిజన సమాజం అభ్యున్నతి, సాధికారత కోసం ప్రారంభించినది.
మన దేశంలోని గిరిజన సంఘాల పునరుద్ధరణ, పురోగతి, సమ్మిళిత అభివృద్ధిని జరుపుకోవడానికి జీ మీడియా సెంట్రల్ విస్టా, ఇండియా గేట్ వద్ద ఈ నెల 5వ తేదీన సాయంత్రం 7 గంటల నుంచి గిరిజన సాంస్కృతిక రాత్రిని నిర్వహించనుంది. ఈ వేడుకలో గిరిజన సంగీతం, నృత్యం, ఫ్యాషన్ షోల సమ్మేళనంగా ఉంటుంది. గ్లిట్జీ, స్టార్రి నైట్ ఫ్యాషన్ షో గిరిజన దుస్తుల ప్రదర్శన ఉంటుంది. రాబోయే ఆన్ గ్రౌండ్ ఈవెంట్ గిరిజన కమ్యూనిటీల గొప్ప సంస్కృతిని పరిచయం చేయడం, గిరిజన ఎస్‌హెచ్‌జీలు, ఏజెన్సీలు, సంస్థలను ప్రధాన స్రవంతి జనాభాతో కనెక్ట్ అయ్యేలా శక్తివంతం చేసే దిశగా ఈ వేడకను నిర్వహించనున్నారు.
గిరిజన వర్గాల పోరాట కథలను అందరికీ తెలియజేయడానికి.. భారతదేశాన్ని సాంస్కృతిక ధనిక దేశంగా మార్చడంలో యువత పోషించే ముఖ్యమైన పాత్రపై అవగాహన కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం 'జనజాతీయ వికాస్' కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భారతదేశ పౌరులను నిమగ్నం చేసే ఏకైక ఉద్దేశంతో రూపొందించినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. గిరిజన సంఘం మన సమాజంలో సమగ్ర పాత్ర పోషిస్తోందని.. భారతదేశంలోని ప్రతి పౌరుడు గిరిజన వారసత్వం, సంస్కృతిని స్వీకరించడానికి ముందుకు రావాలని కోరారు.
ఇండియా డాట్‌కామ్ డిజిటల్ సీఆర్‌ఓ శ్రీధర్ మిశ్రా మాట్లాడుతూ.. దేశంలో గిరిజన సంఘాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జనజాతీయ వికాస్ ప్రచారాన్ని జీ మీడియా మొదలుపెట్టిందని తెలిపారు. తాము ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లేందుకు మార్కెటింగ్ విధానాన్ని అవలంభించామని చెప్పారు. గిరిజన వర్గాల పునరుద్ధరణ, పురోగతి, సమ్మిళిత అభివృద్ధిని జరుపుకోవడంలో అందరూ పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక తెగల వారసత్వం, వారి ప్రాచీన సంప్రదాయాలు, గొప్ప సంస్కృతి, అభివృద్ధిని చూసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
Also Read: IND vs WI: భారత కుర్రాళ్లకు పరీక్ష.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నేటి నుంచే..
Also Read: Adah Sharma hospitalised: 'ది కేరళ స్టోరీ' నటి ఆదాశర్మకు అస్వస్థత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook