Krishna Vamsi: థియేటర్‌లో యువత పెళ్లి.. ఛీ అలా చేయొద్దని `మురారి` దర్శకుడు వార్నింగ్
Krishna Vamsi Fire On Couple Marriage In Theatre: థియేటర్‌లో మురారి సినిమా విడుదల సందర్భంగా థియేటర్‌లో పెళ్లి చేసుకోవడంపై దర్శకుడు కృష్ణ వంశీ బదులిచ్చారు. ఆ పెళ్లి చేసుకున్న యువతపై మండిపడ్డారు.
Krishna Vamsi: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన కుటుంబ కథా చిత్రం 'మురారి' రీ రిలీజ్ సందర్భంగా జరిగిన సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డ్యాన్స్‌లు.. పాటలతో మహేశ్ అభిమానులు రెచ్చిపోయారు. ఇక థియేటర్ల ముందు అయితే యువతులు తీన్మార్ డ్యాన్స్‌లతో హోరెత్తిక్కించారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల యువత థియేటర్‌లో పెళ్లి చేసుకున్న వీడియోలు హల్‌చల్ చేశాయి. యువత చేసిన పనికి మురారి సినిమా దర్శకుడు కృష్ణవంశీ అసహనం వ్యక్తం చేశారు. యువత తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేయడం సరికాదని హితవు పలికారు.
Also Read: Sobhita: శోభితలో ఉన్న ఈ యాంగిల్ తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.. ఉదయాన్నే ఏం చేస్తుందంటే..!
మురారి సినిమాలో పెళ్లి పాట వచ్చిన సమయంలో థియేటర్ స్క్రీన్ ముందు యువతీ యువకులు పెళ్లి చేసుకున్నారు. వాళ్లు పెళ్లి చేసుకుంటే ప్రేక్షకులు, మహేశ్ బాబు అభిమానులు కేకలు, అరుపులతో రెచ్చిపోయారు. ఈ సందర్భంగా యువకుడు యువతి మెడలో తాళి కడుతుండగా ప్రేక్షకులంతా పేపర్లు అక్షింతలుగా వేశారు. ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేసింది. మురారి సినిమా క్రేజ్ అలా ఉందని అభిమానులు ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు.
Also Read: Vishnu Manchu: కూతురు పుట్టినరోజు సందర్భంగా 10 లక్షలు విరాళం.. మంచి మనసు చాటుకున్న మంచు విష్ణు
తన సినిమా రీ రిలీజ్ విడుదల సందర్భంగా జరిగిన సంఘటనలపై మురారి తీసిన దర్శకుడు కృష్ణవంశీ స్పందించారు. 'మన సంస్కృతీ సంప్రదాయాలను దుర్వినియోగం, అపహాస్యం చేయొద్దు. అంతేకాకుండా అవమానపరచొద్దు' అని విజ్ఞప్తి చేశారు. 'దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా' అని తెలిపారు. థియేటర్‌లో పెళ్లి చేసుకున్న యువత తెలిసీ తెలియక అలా చేసి ఉంటారని పేర్కొన్నారు. పెళ్లి చేసుకున్న వారికి మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
సినిమా రీ రిలీజ్ అయిన సందర్భంగా 'ఎక్స్'లో లైవ్‌లోకి వచ్చారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కొందరు మురారి పార్ట్ 2 తీయాలని కోరగా.. చూద్దాం అని బదులిచ్చారు. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. మురారి రీ రిలీజ్ సందర్భంగా జరిగిన పరిణామాలన్నీ నెటిజన్లు కృష్ణ వంశీకి వివరిస్తున్నారు. వాటికి బదులిస్తూ దాదాపు రెండు మూడు గంటలపాటు కృష్ణ వంశీ లైవ్‌లో ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి