Shirley Setia excited about her next line of projects: కృష్ణ వృ0ద విహారి అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది షిర్లీ సేఠియా. ఈ సినిమాలో నాగశౌర్య సరసన వృ0ద మిశ్రా అనే పాత్రలో కనిపించింది. నార్త్ ఇండియా కి చెందిన ఒక అమ్మాయి సౌత్ ఇండియా కి చెందిన ఒక సత్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తితో ప్రేమలో పడితే వారి ప్రేమ ఎలా సఫలమైంది? వారి పెళ్లి వరకు ఎలా నడిచింది? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్వతహాగా సింగర్ కూడా ఆయన ఆమె ఇప్పుడు సౌత్ మీద దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్ లో పుట్టి పెరిగిన ఆమె ముందు సింగర్ గా యూట్యూబ్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ అకౌంట్లో కూడా ఆమెకు లక్షలాదిమంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.


Also Read: The Kerala Story: 9 రోజుల్లో 100 కోట్లు కొల్లగొట్టిన ది కేరళ స్టోరీ


తాజాగా ఆమె సౌత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ముఖ్యంగా టాలీవుడ్ పరిశ్రమ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇండియన్ సినిమా మొత్తాన్ని ముందుండి నడిపిస్తున్న టాలీవుడ్ సినీ పరిశ్రమలో తాను కూడా భాగం అవ్వడం తనకు గర్వంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. నిజానికి నేను తెలుగులో ఒక్క సినిమా చేసినప్పటికీ తన మీద తెలుగు ప్రేక్షకులు కురిపిస్తున్న ప్రేమ చాలా అద్భుతం అని ఆమె చెప్పుకొచ్చారు. నిజానికి ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి ఇప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులు తన పాత్రను మెచ్చి మెసేజ్లు పెడుతూ ఉంటారు అని చెప్పుకొచ్చింది.


ఇక తాను తెలుగు సినిమా కథలు వింటున్నానని త్వరలోనే మరో ఆసక్తికరమైన తెలుగు ప్రాజెక్టుతో ప్రేక్షకులు ముందుకు వస్తానని ఆమె చెప్పుకొచ్చింది. నిజానికి ఆమె సింగర్ గా ఫేమస్ అయ్యారు కానీ ఆమె అలా అవ్వకపోతే మార్కెటింగ్ ఉద్యోగం చేసుకుంటూ ఉండేదాన్ని చెప్పుకొచ్చారు. అయితే భగవంతుడు తన రాత వేరే విధంగా రాశాడని అలా ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా క్రేజ్ అందుకొని సినిమాల్లోకి వచ్చానని ఆమె చెప్పుకొచ్చింది.


Also Read: Puri Jagannadh Next Movie: లైగర్ డిజాస్టర్ తరువాత రామ్ తో పూరీ సినిమా.. ఈ సారి ఏమవుతుందో?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook