Krishnam Raju Funeral Place Changed from Jubilee hills to Moinabad: సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు ఆయన మరణించినట్లుగా ఆయన కుటుంబ సభ్యుల నుంచి మీడియాకు అధికారిక సమాచారం అందింది. అయితే ఆయన అంత్యక్రియలు సోమవారం ఉదయం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే నిజానికి ముందుగా జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరపాలని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఆయనను కడసారి చూసేందుకు వచ్చే అభిమానులు తాకిడికి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం అయితే ఇబ్బందికరంగా ఉంటుందని పోలీసులు, ప్రభుత్వం సలహా మేరకు ఆయన అంత్యక్రియలు జరిగే ప్లేస్ మార్చారని తెలుస్తోంది. ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ శివారు మొయినాబాద్ కనకమామిడి ఫామ్ హౌస్ లో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.


కృష్ణంరాజు కుటుంబానికి చెందిన ఈ ఫామ్ హౌస్ అంటే కృష్ణంరాజుకు చాలా ఇష్టమని, గతంలో ప్రశాంతమైన సమయం గడపాలనుకున్నప్పుడల్లా అదే ప్రదేశానికి వెళుతూ ఉండేవారని కృష్ణంరాజు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఆయన మాజీ కేంద్ర మంత్రి కావడం, తెలుగు సినీ పరిశ్రమలో మలితరం హీరోలలో ఒకరు కావడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన అంత్యక్రియలు అధికార లాంచనాలతో జరపాలని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ శర్మను ఆదేశించారు.


ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ శర్మ కూడా అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. సుమారు 11 గంటల ప్రాంతంలో ఆయన బాధ్యత జూబ్లీహిల్స్ లోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతానికి మొయినాబాద్ ఫామ్ హౌస్ కు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున హార్ట్ ఎటాక్ కారణంతో కన్నుమూశారు. ఆయనకు అనే అనారోగ్య ఇబ్బందులు ఎదురయ్యాయని ఏజీజీ హాస్పిటల్స్ యాజమాన్యం ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.


Also Read: Mani Sharma Mother Passed Away: కృష్ణంరాజు మరణం మరువక ముందే మణిశర్మ ఇంట తీవ్ర విషాదం..


Also Read: Krishnam Raju Funeral Live Updates: చివరి నిముషంలో మారిన అంత్యక్రియల స్థలం.. ఎంతో ఇష్టమైన చోటే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి