Krishnam Raju Funeral Live Updates: అశ్రునయనాలతో కృష్ణంరాజుకు కన్నీటి వీడుకోలు

Krishnam Raju Death Live Updates:  ​తెలుగు నటుడు కృష్ణంరాజు కన్నుమూయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 12, 2022, 04:44 PM IST
  • Krishnam Raju Death Live Updates:  తెలుగు నటుడు కృష్ణంరాజు కన్నుమూయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Krishnam Raju Funeral Live Updates: అశ్రునయనాలతో కృష్ణంరాజుకు కన్నీటి వీడుకోలు
Live Blog

Krishnam Raju Death Live Updates:  తెలుగు నటుడు కృష్ణంరాజు కన్నుమూయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  

12 September, 2022

  • 16:36 PM

    సినీ నటుడు, దివంగత కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి మెయినాబాద్లోని కనకమామిడి ఫాం హౌస్ కు ఆయన పార్థివదేహాన్ని తరలించి కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ అశ్రునయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రభాస్ అన్నయ్య ప్రబోధ్ కృష్ణంరాజుకు తలకొరివి పెట్టారు.  

  • 13:18 PM

    కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభం అయ్యింది. ఆయన ర్దీవదేహానికి పోలీసుల గౌరవ వందనం సమర్పించారు. కృష్ణంరాజు అంతిమయాత్ర జూబ్లీహిల్స్ నివాసం నుంచి రోడ్ నెం 45- బిఎన్ఆర్ కాలనీ బ్రిడ్జి,  గచ్చిబౌలి ఓఆర్ ఆర్ మీదుగా అప్పా జంక్షన్ వరకు సాగనుంది.  అక్కడి నుంచి మొయినాబాద్ - కనకమామిడిలోని ఫామ్ హౌజ్ కు తరలించనున్నారు.

  • 07:53 AM

     

    కృష్ణంరాజు గారి అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు చేవెళ్ల, మొయినాబాద్ దగ్గర లోని కనక మామిడి ఫామ్ హౌస్ లో జరగనున్నాయి. జూబిలీ హిల్స్ లోని కృష్ణం రాజు నివాసం నుండి ఉదయం 11:30 గంటలకు ఆయన పార్థివ దేహం బయలుదేరనుంది. 

  • 16:45 PM

    కృష్ణం రాజు పార్థివ దేహాన్ని సుబ్బిరామి రెడ్డి సందర్శించి నివాళులు అర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు 
     
    సుబ్బిరామి రెడ్డి
     
    కృష్ణం రాజు లేడంటే నమ్మలేక పోతున్నాను
    దాదాపు 50 ఏళ్లుగా సన్నిహితుడు
    నా సినిమాల్లో వంశోద్ధారకుడు, గ్యాంగ్ మాస్టర్ సినిమాల్లో నటించారు
    ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు
    ప్రభాస్ అంటే ఆయనకు చాలా ప్రేమ
    అయన్ని కృష్ణం రాజు పెంచి పెద్ద చేశాడు
    ఏఎన్నార్, ఎన్టీఆర్ తర్వాత కృష్ణం రాజు మలితరం కథానాయకుడు
    ఆయనకు ఆత్మకు శాంతి కలిగి ఆయన కుటుంబానికి ధైర్యం చేకూరాలని కోరుకుంటున్నాను
     

  • 16:14 PM

     

     

    కృష్ణం రాజు పార్థివ దేహాన్ని బండి సంజయ్ సందర్శించి నివాళులు అర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు 

    • బీజేపీ సీనియర్ నేత, అందరి నాయకుడు కృష్ణం రాజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం.
    • ధర్మం కోసం పోరాడుతున్న నాకు ఆయన అనేక సూచనలు ఇచ్చేవారు.
    • నేను చేసే ధర్మ పోరాటం మెచ్చుకుని ప్రోత్సహించేవారు.
    • పార్టీకి అనేక సేవలు అందించిన నిజాయితీ పరుడు
    • అటల్ బిహారీ వాజపేయిని పీఎం చేయాలనీ అప్పట్లో బీజేపీలో చేరారు.
    • వాజ్ పాయ్ అయన్ని గుర్తించి కేంద్ర మంత్రిని చేశారు.
    • అనేక సినిమాల్లో గొప్పగా నటించారు.
    • అంతిమ తీర్పు సినిమా చాలా గొప్ప సినిమా
    • ఆ సినిమా చూశాక ఆయనతో ఫోటో దిగాలని అనుకున్నాను.
    • ఇదే విషయాన్ని ఆయనతో చెప్పా..
    • ఆయన రూపంలో మనకు ప్రభాస్ ఉన్నారు.
    • మేమంతా ఆయన లక్ష్యం కోసం పని చేస్తాం.
    • వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను
    • వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
  • 15:48 PM

    కృష్ణం రాజు నివాసానికి చేరుకున్న కేటీఆర్ ఆయనకు నివాళులు అర్పించి ప్రభాస్ కు ధైర్యం చెప్పారు. ఇక సాయంత్రం నాలుగున్నరకు సీఎం కేసీఆర్ కూడా కృష్ణం రాజు నివాసానికి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే బీజేపీ తెలంగాణ అధ్యక్ష్యుడు బండి సంజయ్ కూడా నువలులు అర్పించనున్నారు. 

  • 15:44 PM

     

    కృష్ణం రాజు పార్థివ దేహాన్ని చంద్రబాబు సందర్శించి నివాళులు అర్పించారు.  ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ 

     

    చంద్రబాబు

    • ఈ రోజు రెబెల్ స్టార్ ని కోల్పోవడం బాధేస్తుంది
    • ఆయనకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది
    • ప్రజలకు సేవ చేసేందుకు మంత్రి అయ్యారు
    • సినిమా పరిశ్రమ ఒక పెద్ద వ్యక్తిని కోల్పోయింది
    • చాలా విషాద సమయం
    • ఆయన లెగసీ ఎప్పటికీ ఉంటుంది
    • ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా ఉండాలి
    • ఇప్పుడే ప్రభాస్ ని కలిశాను
    • ప్రభాస్ ధైర్యంగా ఉండాలి
    • కృష్ణం రాజు లేని లోటు... ప్రభాస్ తీర్చాలి అని కోరుతున్నాను
  • 15:38 PM

     

     జయసుధ:

    ఈరోజు నా హీరో కృష్ణం రాజు లేరు అంటే నమ్మలేక పోతున్నాను

     26 సినిమాలు ఆయనతో నేను కథానాయికగా పని చేశా..

     గోపీ కృష్ణ బ్యానర్ లో, సూర్యనారాయణ రాజు ప్రొడక్షన్ లో  ఎక్కువ సినిమాలు చేశా.. 

     కృష్ణం రాజు మంచి కో స్టార్, మంచి స్నేహితుడు

     కృష్ణం రాజు ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తారు.

  • 15:03 PM

     

     కృష్ణంరాజు పార్థివదేహాన్ని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంకు తరలించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది కానీ జూబ్లీహిల్స్,రోడ్ నెంబర్ 28 లోని ఆయన ఇంటి వద్దే ఉంచబడుతుందని అధికారిక ప్రకటన వెలువడింది. రేపు 1 గంటకు అంతిమ యాత్ర ద్వారా మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబడుతాయని ప్రకటించారు. 

     

  • 14:31 PM

    ప్రభాస్ కు ధైర్యం చెబుతున్న మెగాస్టార్ చిరంజీవి

  • 13:04 PM

    కృష్ణంరాజు పార్థివ దేహాన్ని సందర్శించిన మెగాస్టార్ చిరంజీవి అనంతరం మీడియాతో మాట్లాడారు. 

     

    • ఈ రోజు చాలా దుర్దినం..
    • ఆయన లేరు అన్న మాట జీర్ణించుకోలేక పోతున్న...
    • ఆయన గతంలో చాలా సార్లు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లారు.
    • ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారి ఆరోగ్యంగా తిరిగి వచ్చారు..
    • ఈసారి కూడా ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారు అనుకున్నా..
    • తిరిగి రారు అని ఎవరూ ఊహించలేదు.
    • మొగల్తూరులో  చిన్నప్పుడు ఆయనను చూడటం కోసం ఎగబడిన  వాళ్ళలో నేను ఉన్నాను 
    • ఇంకా ఆ దృశ్యం నా కళ్ళలో కదలాడుతూ ఉంది.
    • ఆయన తీరు ఎంతో రాజసంగా ఉండేది..
    • రావు గోపాల్ రావు లాంటి వాళ్లు రాజావారు రాజావారు అని పిలిచేవారు.
    • కృష్ణంరాజు మహావృక్షం లాంటివారు ఈరోజు ఆ మహావృక్షం నేలకొరిగింది.
    • పరిపూర్ణమైన జీవితాన్ని కృష్ణంరాజు అనుభవించారు..
    • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను...
  • 12:50 PM

    ప్రభాస్‌ను ఓదార్చేందుకు ఏఐజీ(AIG) హాస్పిటల్‌కు అనుష్క శెట్టి..

  • 12:25 PM

    రెబల్ స్టార్ కృష్ణంరాజు  నివాసానికి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ వంటి వారు వచ్చి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ ను హత్తుకుని బాధలో ఉన్న ఆయనని ఓదార్చారు.

  • 12:21 PM

    కృష్ణంరాజు నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించడంతో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా పార్థివదేహాన్ని సందర్శించడానికి వస్తున్నారు. ప్రస్తుతం నివాసంలో కృష్ణంరాజు పార్థివదేహాన్ని ఉంచగా సినీ నటులు ఇతర సెలబ్రిటీలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నా

  • 12:18 PM

     

    కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు పార్థివదేహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్లిన ఆయన కృష్ణంరాజు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. 

  • 11:52 AM

     

    కృష్ణంరాజు భౌతిక కాయం జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకుంది. కాసేపట్లో ఆయన భౌతిక కాయాన్ని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంకు తరలించనున్నారు. ఇక భౌతిక కాయం వెంట మంచు విష్ణు, వీకే నరేష్, శివాజీ రాజా కూడా ఉన్నారు. 

     

     

  • 11:42 AM

    రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు

    తనకు అత్యంత ఆప్త మిత్రుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్  అధికారిక లాంఛనాలు ఏర్పాటు చేయనున్నారు. 

     

     

  • 11:36 AM

    మరికాసేపట్లో జూబ్లీహిల్స్ లోని నివాసానికి  కృష్ణం రాజు డెడ్ బాడీ తరలించనున్నారు. ఆ తర్వాత  మధ్యాహ్నం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంకు కృష్ణంరాజు డెడ్ బాడీ  తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజలు ,అభిమానులు చివరి చూపుల కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

     

Trending News