Krishnam Raju Wife Shyamala : కృష్ణంరాజు భోజనానికి పిలిస్తే అలా చెప్పిన కైకాల.. చనిపోయాక బయటపెట్టిన శ్యామల!
Kaikala Satyanarayana Death Condolences : కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూసిన నేపథ్యంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల సంతాపం వ్యక్తం చేశారు. ఆ వివరాలు
Krishnam Raju Wife Shyamala Condolences on Kaikala Satyanarayana Death: తెలుగు సీనియర్ నటుడు, కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూసిన నేపథ్యంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్యామల ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు కైకాల సత్యనారాయణ గారు కాలం చేశారు అని తెలిసి చాలా బాధ పడ్డామని పేర్కొన్న శ్యామల, ఆయన భార్య కుమార్తెలతో మేమంతా చాలా క్లోజ్ గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటామని అన్నారు.
మొన్నామధ్య కృష్ణంరాజు గారు కైకాల సత్యనారాయణ గారితో మాట్లాడారని, అలా మాట్లాడుతున్న సమయంలో మా ఇంటికి వచ్చి భోజనం చేయాలని అంటే ఖచ్చితంగా వస్తానని, మీరు ఒక టైం చూసి చెప్పమని అడిగారని గుర్తు చేసుకున్నారు. అయితే ఆయన మా ఇంటికి రాకుండానే కృష్ణంరాజు గారు, కైకాల సత్యనారాయణ గారు ఇద్దరూ చనిపోయారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇక కృష్ణంరాజు గారితో కైకాల సత్యనారాయణ అనేక అద్భుతమైన సినిమాల్లో నటించారని పేర్కొన్న ఆమె బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో కృష్ణంరాజు గారితో కలిసి కైకాల సత్యనారాయణ ఒక పాత్ర చేశారు, అది పూర్తి స్థాయి కామెడీతో సాగే పాత్ర అని అన్నారు.
అలాంటి పాత్ర ఆయన ఒప్పుకోవడం చాలా గొప్ప విషయమే, అలాంటి ఒక లెజెండ్రీ నటుడు ఇలాంటి పాత్ర ఒప్పుకున్నాడు అంటే అది నా మీద ఉన్న గౌరవమే అని కృష్ణంరాజు అంటూ ఉండేవారని శ్యామల గుర్తు చేసుకున్నారు. ఇక నవరసాలను పండించగల నవరస నటనా సర్వ భౌమ కైకాల సత్యనారాయణ గారు ఇప్పుడు మనమధ్య లేరంటే నమ్మలేక పోతున్నానని పేర్కొన్న ఆమె ఇదే ఏడాది ఇండస్ట్రీకి చెందిన లెజెండ్స్ దూరం అవడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. కైకాల సత్యనారాయణ కుటుంబం అంతా దృఢంగా ఉండేలా ఆ దేవుడు వారికి శక్తిని ప్రసాదించాలని కోరుతున్నానని పేర్కొన్న ఆమె వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కూడా చెబుతూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
Also Read: Pooja Hegde Iron Leg: పాపం పూజ హెగ్డేని మళ్లీ ఐరెన్ లెగ్ అంటున్నారే!
Also Read: Raviteja - BVS Ravi: డైరెక్టర్ ను చితక్కొట్టిన రవితేజ.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.