Krithi Shetty Photos: చీరకట్టు అయినా మోడ్రన్ డ్రస్సు అయినా బేబమ్మ తర్వాతే ఎవరైనా!
Krithi Shetty Photos: `ఉప్పెన` మూవీతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ కృతి శెట్టి.. ఇప్పుడు వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడామె చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో తరచూ ఫొటోలను షేర్ చేస్తున్న.. బేబమ్మ తాజాగా మరికొన్ని పిక్స్ ను పోస్ట్ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Krithi Shetty Photos: కరోనా సంక్షోభం తర్వాత గతేడాది విడుదలైన 'ఉప్పెన' చిత్రం.. బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. దాదాపుగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఘనతను మూటగట్టుకుంది. ఈ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవగా.. ఇదే సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమైంది.
ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిచిన తర్వాత కృతి శెట్టి వరుస చిత్రాల్లో నటించేందుకు సైన్ చేసేసింది. అలా 'ఉప్పెన' మూవీ తర్వాత 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత అలరించింది. నానితో కలిసి నటించిన 'శ్యామ్ సింగరాయ్' మూవీలో మోడ్రన్ అమ్మాయిగా నటించిన కృతి శెట్టి.. 'బంగార్రాజు' చిత్రంలో సర్పంచ్ నాగలక్ష్మీ పాత్రలో మెప్పించింది.
ఆ సినిమాల తర్వాత ఇప్పుడు మరో మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది హీరోయిన్ కృతి శెట్టి. రామ్ పోతినేని హీరోగా లింగు స్వామి డైరెక్షన్ లో రూపొందుతోన్న 'ది వారియర్' సినిమాతో పాటు నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి' మూవీలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.
Also Read: Acharya OTT Release Date: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'ఆచార్య' ఓటీటీ రిలీజ్ అప్పుడే?
Also Read: Acharya Movie Collection: మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' తొలిరోజు కలెక్షన్ ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.