Krithi Shetty Plastic surgery to her lips: కర్ణాటకకు చెందిన కృతి శెట్టి తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా ముంబైలోనే సెటిల్ కావడంతో ఆమె అక్కడే పుట్టి పెరిగింది. చిన్ననాటి నుంచే సినిమాలు మీద ఆసక్తి పెంచుకున్న ఆమె తొలుత అనేక యాడ్ ఫిలిమ్స్ లో కనిపించింది. ఎట్టకేలకు ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా మారిన ఆమె వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్,   బంగార్రాజు వంటి సినిమాలతో హిట్లు అందుకున్న ఆమె ఇటీవల ది వారియర్ సినిమాతో పరాజయం అందుకుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిట్లు వచ్చినన్ని రోజులు ఆమె అందం గురించి కామెంట్ చేయని వారు ఇప్పుడు ది వారియర్ సినిమాలో ఆమె లుక్కు బాగోలేదంటూ కామెంట్లు చేస్తున్నారట. ఈ సినిమాలో ఆమె లుక్ విషయంలో పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తూ ఉండడంతో ఆమె తన అందాన్ని మెరుగుపరుచుకునే పనిలో పడినట్లు సమాచారం. అందుకోసం ఆమె సర్జరీ కూడా చేయించుకోవడానికి సిద్ధమైనట్లుగా టాలీవుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఈ విషయం మీద ఆలోచించని ఆమె తన పెదాలు లావుగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందట.


ఇప్పుడు ఆ పెదాల సైజు తగ్గించుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఒక ఫేమస్ డాక్టర్ను కన్సల్ట్ అయిందని ఆయన సర్జరీకి డేట్ కూడా ఫిక్స్ చేశారని చెబుతున్నారు. నిజానికి చాలా మంది హీరోయిన్లు తమ మొఖాలకు,   ఇతర శరీర భాగాలకు సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. అది సాధారణ ప్రక్రియే,   ఇప్పుడు బేబమ్మ కూడా వారి జాబితాలో జాయిన్ అవ్వబోతోంది అన్న మాట. అయితే అసలు విషయం ఏమిటంటే ఆమెకు చేతినిండా సినిమాలు ఉన్నాయి చూడడానికి పక్కింటి పిల్లల్లా కనిపించే ఆమె ఇప్పుడు కాస్త మోడరన్ బేబ్ లుక్ లోకి మారడానికి చూస్తోందన్న మాట. 


Also Read: Actor Chandan Kumar: తొందరపాటుకు తప్పదు మూల్యం.. సీరియల్స్ నుంచి లైఫ్ టైం బ్యాన్


Also Read:Uma Maheshwari Death: అందుకే ఆత్మహత్య.. లేఖ దొంగతనం కూడా.. సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మీ పార్వతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook