Krithi Shetty: బాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేసిన బేబమ్మ.. ఎందుకో తెలుసా?
Krithi Shetty Rejected Bollywood Offer: తనకి బాలీవుడ్ సినిమా అవకాశం వస్తే వదులుకున్నానని కృతి శెట్టి వెల్లడించింది. అయితే అలా ఎందుకు చేసింది అనేది ఆసక్తికరంగా మారింది.
Krithi Shetty Rejected Bollywood Offer: ముంబైలోనే పుట్టి పెరిగిన కృతి శెట్టి తొలుత బాలీవుడ్ సినిమా సూపర్ 30తోనే నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే తరువాత టాలీవుడ్ లో ఉప్పెన సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ వరుస హిట్లు అందుకుంటూ దూసుకుపోతోంది. బంగార్రాజు, శ్యాం సింగరాయ, ది వారియర్ సినిమాలలో మెరిసిన ఆమె ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది అదేమిటంటే నిజానికి ఆమెకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయట. శ్యాం సింగరాయ్, బంగార్రాజు సినిమాలు సూపర్ హిట్గా నిలిచిన తర్వాత తనకి బాలీవుడ్ నుంచి ఒక ఆఫర్ వచ్చిందనే విషయాన్ని కృతి శెట్టి తాజాగా బయటపెట్టింది. అయితే తనకు టాలీవుడ్ ఏం కావాలో అది ఇచ్చింది కాబట్టి ఇక బాలీవుడ్ వెళ్లాల్సిన అవసరం లేదు అనుకుని ఆ ఆఫర్ తిరస్కరించానని ఆమె వెల్లడించింది.
ఇక మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటించిన సీనియర్ నటీనటులు అందరూ తన విషయంలో చాలా ప్రేమ చూపించారని చెబుతూనే సముద్రఖని వంటి వారి నటన గురించి కూడా ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా కోసం నటీనటులు సహా టెక్నీషియన్స్ ఎంతో కష్టపడ్డారని వారి కష్టం చూసిన తర్వాత వారిపై గౌరవం పెరిగిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ నెలలో బింబిసార, సీతారామం సినిమాల రూపంలో టాలీవుడ్ కు రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ దొరికాయి దానికి చాలా ఆనందంగా ఉందని కృతి శెట్టి చెప్పుకొచ్చారు.
ఇక తమ సినిమాని కూడా అలాగే ఆదరించి మంచి సక్సెస్ ఇవ్వాలని ఆమె అభిమానులను కోరారు. అయితే మరి కొందరు మాత్రం కృతిశెట్టికి బాలీవుడ్ ఆఫర్ రాకపోయి ఉండవచ్చని కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ముంబైలోనే పుట్టి పెరిగిన ఈ భామ బాలీవుడ్ సినిమాల నుంచి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ సినిమా ఆఫర్ వస్తే కాదనే పరిస్థితి ఉండదని, కేవలం తన క్రేజ్ పెంచుకోవడం కోసమే అని ఇలా కామెంట్ చేస్తూ ఉండి ఉండవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందులో నిజా నిజాలు ఏ మేరకు ఉన్నాయ్ అనేది ఆమెకే తెలియాలి.
Also Read: Balakrishna: టాలీవుడ్ నిర్మాతలకు బాలకృష్ణ దిమ్మతిరిగే షాక్.. దెబ్బకు నష్టనివారణ చర్యలు!
Also Read: Nanayathara: భర్త చేసిన పనికి నయనతారకు అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook